తెలుగు మీడియం రద్దుపై స్పందించిన పవన్‌

Pawan Kalyan
Pawan Kalyan

అమరావతి: జనసేన అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌ ట్విట్టర్‌ వేదికగా ఏపిలో తెలుగు మీడియం రద్దు చేయడాన్ని తీవ్రంగా విమర్శించారు. ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు మీడియం రద్దు చేస్తే తెలుగు భాష, సంస్కృతి మరుగున పడే ప్రమాదముందని పవన్‌ ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగు మీడియం రద్దు చేస్తుంటే అధికార భాషా సంఘం ఎందుకు మిన్నకుందని ఆయన ప్రశ్నించారు. భాష, సంస్కృతిని ఏ విధంగా కాపాడుకోవాలో తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌ను చూసి నేర్చుకోవాలని హితవు పలికారు.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/