ఫ్యామిలీ తో కలిసి వెకేషన్ కు వెళ్లిన పవన్ కళ్యాణ్

సినీ నటుడు , జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గత కొద్దీ నెలలుగా ఎంత బిజీ గా ఉన్నాడో చెప్పాల్సిన పనిలేదు. క్షణం తీరిక లేకుండా రాజకీయాలతో , సినిమాలతో గడిపేస్తున్నాడు. పవన్ కళ్యాణ్ పడుతున్న కష్టం చూసి కుటుంబ సభ్యులే కాదు అభిమానులు సైతం అయ్యో అని అంటున్నారు. వరుసగా సినిమాలు షూటింగ్లు చేస్తూ..మరోపక్క రాజకీయ కార్యక్రమాల్లో బిజీ గా ఉంటూ వస్తున్నారు. తాజాగా కాస్త రిలాక్స్ కోసం ఫ్యామిలీ తో కలిసి వెకేషన్ కు వెళ్లినట్లు తెలుస్తుంది.

రీసెంట్ గా సముద్రఖని తో చేస్తున్న సినిమా షూటింగ్ పూర్తి చేసాడు. వెకేషన్ నుండి వచ్చాక హరిహర వీరమల్లు తో పాటు హరీష్ శంకర్ మూవీస్ లలో జాయిన్ కానున్నాడని సమాచారం. ప్రస్తుతం పవన్ చేతిలో మూడు సినిమాలు ఉండగా..అవన్నీ ఈఏడాదిలోపే పూర్తీ చేయాలి. ఎందుకంటే ఈ ఏడాది చివర్లో ఎన్నికలు రాబోతున్నాయి. అందుకే ఏమాత్రం రెస్ట్ లేకుండా పవన్ గడుపుతున్నాడు.