పవన్‌ కళ్యాణ్‌కు జీవోల గురించి తెలియదు

మూడు రాజధానులకు అనుగుణంగా సీఎం అడుగులు

mla roja
mla roja

అమరావతి: జనసేన అధినేత పవన్ కల్యాణ్, హిందూపురం టిడిపి ఎమ్మెల్యే బాలకృష్ణపై వైఎస్సార్‌సిపి ఎమ్మెల్యే రోజా ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇవాళ అమరావతిలో మీడియాతో మాట్లాడిన ఆమె… పవన్‌కల్యాణ్‌కు జీవోల గురించి తెలియదన్నారు. చీకటి జీవోలంటూ టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శలు గుప్పించారు. మూడురాజధానులకు అనుగుణంగా జగన్‌ అడుగులు వేస్తున్నారన్నారు. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబుకు బాలకృష్ణ సైగ చేసి బుద్ధి చెప్పి ఉంటే బాగుండేది. రాయలసీమ నుంచి చంద్రబాబును, బాలకృష్ణను తరిమికొట్టే రోజు వస్తుంది. పెద్దల సభకు పెద్దలను తీసుకురాకుండా దద్దమ్మలను తీసుకొచ్చారు. చంద్రబాబు భజనపరులే మండలిలో ఉన్నారు. వారు ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే. లోకేష్‌ ఎమ్మెల్యేగా గెలవలేరు. లోకేష్‌ భవిష్యత్‌ రాజకీయ సమాధి అవుతుంది. అందుకే మండలి రద్దును చంద్రబాబు అడ్డుకుంటున్నారు అని ఎమ్మెల్యే రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి : https://www.vaartha.com/telangana/