మహేష్ బాబు కు దీపావళి గిఫ్ట్ పంపిన పవన్ కళ్యాణ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ …పండగ వేళ తన స్నేహితులకు దగ్గరివారికి గిఫ్ట్ లు పంపిస్తుంటారు. తాజాగా దీవాలి పర్వదినాన సూపర్ స్టార్ మహేష్ బాబు కు గిఫ్ట్ పంపించి కుటుంబ సభ్యులను , అభిమానులకు ఆకట్టుకున్నారు. ఈ విషయాన్నీ మహేష్ భార్య నమ్రత సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.

గిఫ్ట్ పంపిన పవన్ కళ్యాణ్ కు కృతజ్ఞతలు తెలిపారు. పవర్ స్టార్ మహేష్ బాబు కు మాత్రమే కాకుండా దర్శకులు హరీష్ శంకర్ మరియు క్రిష్ లకు సైతం గిఫ్ట్ లు పంపారు. ప్రస్తుతం పవన్ క్రిష్ దర్శకత్వం లో హరిహర వీరమల్లు అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక హరీష్ శంకర్ దర్శకత్వం లోనూ పవన్ కళ్యాణ్ భవదీయుడు భగత్ సింగ్ అనే సినిమాలో నటించనున్నారు. ప్రస్తుతం సంక్రాంతి బరిలో భీమ్లా నాయక్ మూవీ తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. సాగర్ ఈ చిత్రానికి డైరెక్ట్ చేయగా ..త్రివిక్రమ్ మాటలు , స్క్రీన్ ప్లే అందజేస్తుండడం విశేషం.

Powerstar @pawankalyan and Anna Lezhneva garu Deepavali Gifts To Superstar @urstrulymahesh Family

Credits:Namrata Mam @instagram Story pic.twitter.com/dinbtbZLEI— Mahesh Babu Trends 🔔 (@MaheshFanTrends) November 4, 2021