ఆ రెండు పార్టీలతో పొత్తు, జనసేనకు అవసరం లేదు

pawan kalyan
pawan kalyan


తణుకు: జనసేన అధినేత పవన్‌ ఇవాళ పశ్చిమ గోదావరి జిల్లాలోని తణుకులో ప్రచారం చేస్తున్నారు. ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ పవన్‌ తన ప్రసంగాల్లో తీవ్రత పెంచారు. అక్కడ జరిగిన సభలో పవన్‌ మాట్లాడుతూ..వైఎస్‌ఆర్‌సిపి, టిడిపిలను ఆయన టార్గెట్‌ చేశారు. ఆ రెండు పార్టీలతో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం జనసేనకు లేదని, తప్పుడు ప్రచారాలు చేస్తే ఉభయగోదావరి జిల్లాల టిడిపి నేతలకు మర్యాద దక్కదని పవన్‌ హెచ్చరించారు. ఐనా సైకిల్‌ చైన్‌ ఎప్పుడో తెంపేశామని, ఐనా ఆ పార్టీ నేతలు ప్రచారాలు చేయడంలో అర్ధం లేదని అన్నారు. రాష్ట్ర ప్రజలు రాజకీయాల్లో మార్పు కోరుకుంటున్నారని, అందుకే చంద్రబాబు పెన్షన్‌ ఇచ్చి రాజకీయాల నుంచి రిటైర్‌ కావాలని సూచించారు.
తాను సుదీర్ఘ ప్రణాళికతోనే రాజకీయాల్లోకి వచ్చానని, ఈ ఎన్నికలతోనే అంతా అయిపోతుందని భావించడంలేదని పవన్‌ స్పష్టం చేశారు. ఈ ఎన్నికలు ఐన తర్వాత జైలుకు వెళ్లడానికి తనపై జగన్‌లా అక్రమాస్తుల కేసులు లేవని, చంద్రబాబులా ఓటుకు నోటు కేసు లేదని సెటైర్‌ వేశారు.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/