కర్నూలు సభలో పవన్‌ హామీల వర్షం

pawan kalyan
pawan kalyan

కర్నూలు: ఎన్నికల సమయం దగ్గరపడుతుండడంతో రాజకీయ నాయకుల హామీలు ఎక్కువవుతున్నాయి. దీనిలో భాగంగానే జనసేన అధినేత పవన్‌ కర్నూలు జిల్లా నందికొట్కూరులో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ప్రచారంలో పవన్‌ హామీల వర్షం కురిపించారు. వచ్చే ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత కేసి కెనాల్‌ ద్వారా రెండు పంటలకు నీళ్లందిస్తామని జనసేనాని హామీ ఇచ్చారు. అలాగే వృద్దులకు అంటే 60ఏళ్లు పైబడిని వారికి రూ. 5 వేల పెన్షన్‌, ఎకరానికి రూ. 8 వేలు పెట్టుబడి సాయం అందిస్తామన్నారు. అభివృద్దిలో వెనుకబడిన ప్రాంతం కాబట్టి దీని కోసం సౌభాగ్య రాయలసీమ కింద రూ. 50 వేల కోట్ల నిధులు మంజూరు చేస్తామని చెప్పారు. అంతేకాదు, కళాకారుల కోసం రాయలసీమ కల్చరల్‌ అకాడమీ ఏర్పాటు చేస్తామని తెలిపారు. మూడు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని, విద్యార్ధులకు ఉచితంగా ల్యాప్‌టాప్స్‌ పంపిణీ చేస్తామని చెప్పారు. ప్రతి కుటుంబానికి ఏడాదికి ఆరు నుంచి పతి ఉచిత గ్యాస్‌ సిలిండర్లు అందిస్తామని తెలిపారు.

తాజా సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/photo-gallery/actors/