జూబ్లీ హిల్స్‌లో రూ. 12 కోట్ల తో పవన్ కొత్త ఇల్లు కొనుగోలు చేశాడా..?

సినీ నటుడు , జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జూబ్లీ హిల్స్‌లో రూ. 12 కోట్లతో కొత్త ఇల్లు కొనుగోలు చేశాడా అంటే అవుననే అంటున్నాయి పలు మీడియా సంస్థలు. 676 గజాల విస్తీర్ణంలోని బంగ్లాను ఆయన కొనుగోలు చేశారట. దీనికి సంబంధించి రిజిస్ట్రేషన్ 2021 సెప్టెంబర్ 23న జరిగిందని, ఇందుకు గానూ ఆయన రూ. 66 లక్షల స్టాంప్ డ్యూటీ, రూ. 18 లక్షల ట్రాన్స్‌ఫర్ డ్యూటీ, రూ. 6 లక్షల రిజిస్ట్రేషన్ రుసుము, మ్యూటేషన్ ఛార్జీల నిమిత్తం మరో రూ. 1.20 లక్షలు వెచ్చించినట్టు డాక్యుమెంట్‌లో పేరొన్నట్టు తెలుస్తోంది.

దీనికి సంబంధించి పవన్ కళ్యాణ్ సన్నిహితుల నుంచి ఎలాంటి అధికారిక సమాచారం లేదు. ఇంతకముందు కూడా పవన్ కళ్యాణ్ ఓ ఖరీదైన కారు కొనుగోలు చేసినట్టు వార్తలు వచ్చాయి. మరి ఈ వార్తల్లో ఎంత నిజం ఉందనేది తెలియాల్సి ఉంది. ఇక సినిమాల విషయానికి వస్తే..ప్రస్తుతం భీమ్లా నాయక్ , హరిహర వీరమల్లు చిత్రాలు సెట్స్ ఫై ఉండగా..హరీష్ శంకర్ డైరెక్షన్లో చేయబోయే మూవీ త్వరలో సెట్స్ పైకి రానుందని సమాచారం. ఇక పొలిటికల్ విషయానికి వస్తే..రీసెంట్ గా వైసీపీ పార్టీ ఫై , నేతలపై ఘాటైన వ్యాఖ్యలు చేసి విమర్శల పాలయ్యారు.