ప్రజలకు మరిన్ని సేవలు అందించాలని ఆకాంక్ష

బండి సంజయ్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన పవన్ కల్యాణ్

Pawan Kalyan
Pawan Kalyan

అమరావతి: జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ బిజెపి తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ‘బండి సంజయ్ గారికి, నా తరపున, జనసైనికుల తరపున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. యాదగిరి నరసింహస్వామి, కొండగట్టు ఆంజనేయస్వామి ఇరువురు మీకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని, ప్రజలకు మరింత సేవలు అందించేలా, ఇంకా ఉన్నత పదవులు మీకు లభించాలని కోరుకుంటున్నాను’ అంటూ ఆయన ట్వీట్ చేశారు. నేడు బండి సంజయ్ జన్మదినం  సందర్భంగా ఆయనకు పార్టీలకు అతీతంగా జన్మదిన శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా ఆయనకు బర్త్ డే విషెస్ చెప్పారు.


తాజా సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/movies/