హరిద్వార్ గంగా హారతిలో పవన్ కల్యాణ్

హరిద్వార్ : హరిద్వార్ పర్యటనలో ఉన్న జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఈరోజు ఉదయం పవిత్ర గంగా హారతిలో పాల్గని హారతిని ఆద్యంతం తిలకించారు. అనంతరం జనసేనాని పవన్ కల్యాణ్ మీడియాతో మాట్లాడుతూ.. గంగా ప్రక్షాళన కార్యక్రమానికి తన వంతు కృషి చేస్తానన్నారు. అందుకు అనుగుణంగా ప్రజల నమ్మకాలు, విశ్వాసాలను దృష్టిలో పెట్టుకొని నడుచుకుంటానన్నారు. గంగ ను కాలుష్యానికి గురికాకుండా ఘన సంస్కృతిని పరిరక్షించేందుకు తీసుకోవాల్సిన అంశాలపై స్థానికులతో చర్చించారు. గంగానది ప్రక్షాళన కోసం దక్షిణాది రాష్ట్రాల నుండి పెద్దగా మద్దతు రావడం లేదని ఆ లోటును భర్తీ చేయాలని మాత్రిసదన్ ఆశ్రమ ప్రతినిధులు పవన్ కల్యాణ్ ను కోరారు.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/telengana/