ఢిల్లీ చేరుకున్న పవన్‌ కళ్యాణ్‌

Pawan Kalyan
Pawan Kalyan

ఢిల్లీ: జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌, ఆ పార్టీ నేత నాదెండ్ల మనోహర్‌ ఢిల్లీ చేరుకున్నారు. బిజెపి పెద్దలతో ఈ రోజు పవన్‌ భేటీ అవ్వనున్నారు. ఏపి రాజధానుల ప్రతిపాదనపై బిజెపి పెద్దలతో చర్చించనున్నారు. అయితే గత కొన్నిరోజులుగా జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే జనసేనాని పవన్ కల్యాణ్ స్పీడు పెంచినట్టు అర్థమవుతోంది. ఢిల్లీ వెళ్లి బిజెపి పెద్దలతో మాట్లాడి మైత్రి కుదుర్చుకుని వచ్చి ఇక్కడి రాజకీయ వర్గాలను పవన్ ఆశ్చర్యంలో ముంచెత్తారు. తాజాగా మరోసారి ఆయన ఢిల్లీ వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. పార్టీలో నెంబర్ 2గా కొనసాగుతున్న నాదెండ్ల మనోహర్ తో కలిసి కొద్దిసేపటి క్రితమే ఆయన ఢిల్లీ చేరుకున్నారు. మరికాసేపట్లో పవన్ కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తో భేటీ కానున్నారు. ఆపై, జనసేన-బిజెపి సమన్వయ కమిటీ సమావేశంలో పాల్గొంటారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/