రాజీనామాకు ముందు ఇవన్నీ తెలుసుకుంటే బాగుండేది

లక్ష్మీనారాయణ రాజీనామాపై స్పందించిన పవన్ కల్యాణ్

pawan kalyan
pawan kalyan

అమరావతి: జనసేన పార్టీకి సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అయితే జేడీ రాజీనామాపై ఆ పార్టీ చీఫ్ పవన్ కల్యాణ్ స్పందించారు. ఆయన మనోభావాలను గౌరవిస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ మేరకు ఆ పార్టీ ఓ ప్రకటన విడుదల చేసింది. అందులో పవన్.. తనకు సిమెంట్ ఫ్యాక్టరీలు, పవర్ ప్రాజెక్టులు, గనులు, పాల ఫ్యాక్టరీలు లేవని పేర్కొన్నారు. అత్యధిక జీతం తీసుకునే ప్రభుత్వ ఉద్యోగినీ కానని స్పష్టం చేశారు. తనకు తెలిసిందల్లా సినిమా ఒక్కటేనని, తన మీద ఆధారపడి అనేక కుటుంబాలు జీవిస్తున్నాయని వివరించారు. వారి కోసం, తన కుటుంబం కోసం, పార్టీని ఆర్థికంగా బలోపేతం చేయడం కోసం తాను సినిమాలు చేయక తప్పదని పవన్ స్పష్టం చేశారు. లక్ష్మీనారాయణ రాజీనామా చేయడానికి ముందు ఇవన్నీ తెలుసుకుని ఆ లేఖలో ప్రస్తావించి ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు. పార్టీకి ఆయన రాజీనామా చేసినప్పటికీ వ్యక్తిగతంగా తనకు, జనసైనికులకు ఆయనపై గౌరవం ఎప్పటికీ అలానే ఉంటుందన్నారు. ఆయనకు శుభాభినందనలు తెలుపుకుంటున్నట్టు పవన్ పేర్కొన్నారు.

తాజా ఇపేపరు వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://epaper.vaartha.com/