వైకాపా పాలనలో ఏపీ రహదారులు అధ్వానం: పవన్ కళ్యాణ్

ప్రభుత్వం స్పందించని పక్షంలో గాంధీ జయంతి రోజున శ్రమదానంతో రోడ్లను  బాగు చేద్దాం: పవన్ కళ్యాణ్

Pawan Kalyan's criticism of the AP government
Pawan kalyan

Amaravati: దేశం కానీ, రాష్ట్రం కానీ, ప్రాంతం కానీ అభివృద్ధి చెందాలంటే అక్కడ రహదారుల వ్యవస్థ చాలా పటిష్టంగా ఉండాలని జన సేన అధినేత పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. బుధవారం ఆయన మాట్లాడుతో.. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం వేల కిలోమీటర్ల జాతీయ రహదారులను నిర్మిస్తూ, రోడ్ల వ్యవస్థను పటిష్టం చేసుకుంటూ ముందుకు వెళ్తుంటే.. వైసీపీ పాలనలో ఏపీ రోడ్ల వ్యవస్థ అడుగుకో గుంత… గజానికో గొయ్యిలా ఉందని పేర్కొన్నారు. ఇవి సరదాకు చేస్తున్న రాజకీయ విమర్శలు కాదని . నివర్ తుపాన్ సమయంలో కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో పర్యటించినప్పుడు ప్రత్యక్షంగా దెబ్బ తిన్న రోడ్లను చూశానని అన్నారు. తన పర్యటనలో భాగంగా నెల్లూరు జిల్లా గూడూరు నియోజకవర్గం తిప్పవరపుపాడు గ్రామానికి వెళ్లే దారిలో దాదాపు ఏడెనిమిది కిలోమీటర్ల మేర రోడ్డు చిధ్రమైందని, నిలువెత్తు గోతులతో ఉందని అన్నారు. వెళ్లేదారిలో గుంతలోపడి ఒక ట్రాక్టర్ తిరగబడిపోయిందని, ఆ ప్రాంత యువకులతో మాట్లాడితే మా ఊరే కాదు నియోజకవర్గం మొత్తం రోడ్లు ఇలానే ఉన్నాయని చెప్పారు. ట్రాక్టరే కాదు గర్భిణి స్ర్తీ వెళ్లే ఆటో కూడా తిరగబడిపోయిందని చెప్పారు. ప్రజాప్రతినిధులకు చెప్పినా ఏమీ బాగుపడలేదు అని ఆవేదన చెందారు.
రోడ్ల గురించి అడిగితే బెదిరింపులకు దిగుతున్నారని, పోలీసులతో లాఠీ ఛార్జీలు చేయించే పరిస్థితులు ఉన్నాయని పేర్కొన్నారు. ఒక్క నెల్లూరు జిల్లానే కాదు పామర్రు, గుడివాడ వెళ్లినప్పుడు కూడా ఇదే పరిస్థితి కనిపించిందని, భీమవరం నుంచి తాడేపల్లిగూడెం వెళ్లే ఆర్ అండ్ బీ రోడ్డు గానీ, అనంతపురం నుంచి తాడిప్రతి వెళ్లే రోడ్డు… ఏ రోడ్డు తీసుకున్న చాలా అధ్వాన్నంగా తయారయ్యాయని అన్నారు. . రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో దాదాపు లక్షా 20వేల కిలోమీటర్లకు పైగా రోడ్లు ఉన్నాయి. ఈ రోడ్లు దెబ్బ తిన్నా బాగు చేయడం లేదని విమర్శించారు.

తాజా సినిమా వార్తల కోసం: https://www.vaartha.com/news/movies/