కోనసీమ గొడవలు ఉద్దేశపూర్వకంగానే జరిగాయంటూ పవన్ కీలక వ్యాఖ్యలు

కోససీమ జిల్లా పేరును అంబేద్కర్ జిల్లాగా మార్చడం ఫై అమలాపురంలో కోనసీమ సాధన సమితి ఆందోళన చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ ఆందోళన ఉద్రిక్తతకు దారి తీయడం , పలు వాహనాలు దగ్ధం చేయడం , నేతల ఇళ్లకు నిప్పు పెట్టడం వంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. ప్రస్తుతం జిల్లా పోలీసుల నిఘాలో ఉంది. ఇదిలా ఉంటె కోనసీమ గొడవలు ఉద్దేశపూర్వకంగానే జరిగాయంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కామెంట్స్ చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతుంది.
జనసేన పార్టీ విస్తృత స్థాయి సమావేశం కోసం శుక్రవారం విజయవాడ వచ్చిన పవన్ కల్యాణ్ మీడియా తో మాట్లాడుతూ ..కోనసీమ గొడవలు ఉద్దేశపూర్వకంగానే జరిగాయని ఆరోపించారు. జిల్లాల విభజనలో విరుద్ధమైన విధానంలో వైసీపీ ప్రభుత్వం ఉందని, అల్లర్లపై నిఘా విభాగానికి సమాచారం ఎందుకు రాలేదని ప్రశ్నించారు. గొడవలు జరుగుతాయని ప్రభుత్వానికి ముందే తెలుసునని పవన్ కల్యాణ్ ఆరోపించారు. ఈ కారణంగానే ఇప్పటిదాకా పాలకులు అల్లర్లపై స్పందించలేదని ధ్వజమెత్తిన పవన్ కల్యాణ్.. సమస్య అంబేద్కర్ పేరు కాదన్న పవన్.. ఒక పార్టీలో రెండు వర్గాల మధ్య గొడవే అల్లర్లకు కారణమని అని ఆయన వ్యాఖ్యానించారు. వైసీపీలోని భిన్నాభిప్రాయాలను తొక్కి అల్లర్లను రేపారని ఆయన ఆరోపించారు.