పశ్చిమగోదావరి జిల్లాలో పర్యటన

Pawan Kalyan
Pawan Kalyan

Eluru: పశ్చిమగోదావరి జిల్లాలో జనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ ప్రజా పోరాట యాత్ర విజయవంతంగా కొనసాగుతోంది. ప్రజా పోరాట యాత్రలో భాగంగా ఏలూరులో పవన్‌ న్యాయవాదులతో భేటీ అయ్యారు. న్యాయవాదులు ఎదుర్కొంటున్న సమస్యలను పవన్‌ తెలుసుకుంటున్నారు. అనంతరం ప్రభుత్వ టీచర్స్‌ అసోసియేషన్‌తో పవన్‌ సమావేశం కానున్నారు. పోరాట యాత్రలో భాగంగా మధ్యాహ్నం చింతలపూడిలో జరిగే బహిరంగ సభలో పవన్‌ పాల్గొని ప్రసంగించనున్నారు. జంగారెడ్డిగూడెంలో పవన్‌ పర్యటించనున్నారు. అక్టోబర్‌ 3 వరకు జంగారెడ్డిగూడెంలోనే మకాం వేయనున్నారు.