ప్రణాళికాబద్ధంగా ముందడుగు

PAWAN KALYAN
PAWAN KALYAN

ప్రణాళికాబద్ధంగా ముందడుగు

‘జనసేన’ అధినేత పవన్‌కళ్యాణ్‌

హైదరాబాద్‌: జనసేన పార్టీ కార్యకలాపాలను నిర్దేశిత ప్రణాళిక ప్రకారం చురుగ్గా చేపట్టాలని పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీకి పార్టీ అధ్యక్షుడు పవన్‌కళ్యాణన్‌ దిశానిర్దేశం చేశారు. గురువారం ఉదయం హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో ప్యాక్‌ సమావేశాన్ని నిర్వహించారు. పార్టీ చేపట్టాల్సిన కార్యకలాపాలు, పార్టీ బలోపేతంపై చర్చించారు.. ఇందుకు సిద్ధం చేసిన ప్రణాళికలను పవన్‌ వివరించారు.. వాడవాడకీ జనసేన జెండా కార్యక్రమం చేపట్టంతోపాటు పార్టీ విజన్‌ డాక్యుమెంట్‌ ఉద్దేశాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ పార్టీ శ్రేణులు ఎప్పుడూ ప్రజలకు చేరువలో ఉండాలని స్పష్టం చేశారు. జనసే బలోపేతానికి ప్రణాళికాబద్ధంగా ముందడుగు వేయాలన్నారు 2న సిపిఎం తెలంగాణ శాఖతో చర్చలు తెలంగాణ ఎన్నికల్లో కలిసి పనిచేయాలన్న అభిబాషను సిపిఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం వ్యక్తం చేసిన అంశంపై ప్యాక్‌ సమావేశంలో చర్చించారు.. పార్టీ అధ్యక్షుడు పవన్‌ సూచన మేరకు సిపిఎం తెలంగాణ నాయకులను జనసేన చర్చలకు ఆహానించింది.. సెప్టెంబర్‌ 2న జనసేన కార్యాలయంలో జనసేన, సిపిఎం మధ్య ప్రాథమిక చర్చలు జరపనున్నారు.. జనసేన తరపున పార్టీ ప్రధాన కార్యదర్శి తోట చంద్రశేఖర్‌, రాజకీయ వ్యవహారాల కమిటీ కన్వీనర్‌ మాదాసు గంగాధరం, రాజకీయ కార్యదర్శి పి.హరిప్రసాద్‌, పార్టీ ఉపాధ్యక్షుడు బి.మహేంధర్‌ రెడ్డి, పార్టీ తెలంగాణ ఇన్‌చార్జి ఎన్‌. శంకర్‌ గౌడ్‌ పాల్గొనున్నారు.