బాధితులకు జనసేన అండ

PAWAN KALYAN
PAWAN KALYAN

బాధితులకు జనసేన అండ

అక్రమ మైనింగ్‌ను అరికట్టకుంటే జనసైనికులే మూయిస్తారు
పేలుడు బాధితులకు పవన్‌ పరామర్శ

కర్నూలు: రాష్ట్రంలో అక్రమ మైనింగ్‌ క్వారీలకు అడ్డుకట్టవేస్తేనే హత్తిబెళగల్‌ క్వారీ పేలుడు వంటి సంఘటనలు జరగకుండా ఉంటాయని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ అన్నారు..సోమవారం కర్నూలు జిల్లాలో పర్యటించిన ఆయన ఆలూరు మండలం హత్తిబెళగల్‌ క్వారీలోపేలుడు సంభవించిన ప్రదేశాన్ని పరిశీలిం చారు.. క్వారీలో పేలుడు ఘటనలకు సంబంధించిన వివరాలు ఆయన అడిగి తెలుసుకున్నారు.. అనంతరం గ్రామ ప్రజలతో ఆయన మాట్లాడారు.. ఈసందర్భంగా పవన్‌ తన ప్రసంగిస్తూ.. సచివాలయంలో కూర్చొని గ్రామాల్లో ఏం జరుగుతుందో తెలుసుకుంటానని, రియల్‌ టైం గవర్నెన్స్‌ అని చెప్పే సిఎం చంద్రబాబుకు నిజానికి గ్రామాల్లో ఏం జరుగుతుందో తెలియదని విమర్శించారు. రాష్ట్రంలోఅక్రమ మైనింగ్‌లను తక్షణమే నిలిపివేయాలని డిమాండ్‌ చేశారు.. లేని పక్షంలో జనసైనికులే వాటిని మూయిస్తారని అన్నారు. హత్తిబెళగల్‌ క్వారీ పేలుడు దురదృ ష్టకరమని పేర్కొన్నారు.. సిఎం చంద్రబాబు ప్రజాసమస్యలను గాలికొదిలే శారని దుయ్యబట్టారు. ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకు అక్రమ మైనింగ్‌ జరుగుతుంటే మైనింగ్‌శాఖ మంత్రి , అధికారులు ఏంచేస్తున్నారని ప్రశ్నించారు.. ఒక్క కర్నూలు జిల్లాలోనే1300 క్వారీలకు అనుమతి ఇచ్చారని, మరో 600 వరకు అక్రమ క్వారీలు నడుస్తున్నా అధికారులు పట్టించుకోవటం లేదని విమర్శించారు.అక్రమ మైనింగ్‌ను పాలకులు, అధికారులు పట్టించుకోకపోవటం పట్ల ప్రజలకు తీవ్ర నష్టం జరుగుతోందని అన్నారు.. ఇళ్లు బీటలు పడుతున్నాయని, ప్రాణాలు పోతున్నా పాలకులకు పట్టటం లేదని అన్నారు ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించిన పేలుడు ఘటనలో మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియో ఇవ్వటం మాత్రమే కాకుండా మున్ముందు ఇలాంటి సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరారు..