ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి ప్రత్యేక పూజలు

 

Pawan Kalyan
Pawan kalyan

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకుని.. పట్టువస్త్రాలు, పసుపుకుంకుమ సమర్పించారు. ఈ సందర్భంగా ఆయనకు ఘన స్వాగతం పలికిన ఆలయ అధికారులు.. శాలువా కప్పి సన్మానించారు. జనసేనానిని తమ సెల్ ఫోన్లలో బంధించడానికి భక్తులు పోటీపడ్డారు. అంతకుముందు సీఎం కేసీఆర్ సతీసమేతంగా అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారికి ప్రత్యేకపూజలు నిర్వహించారు. ఎంపీ కవిత బంగారు బోనం సమర్పించారు. శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్, అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డి, మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, తలసాని, ఎస్సీ, ఎస్టీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ అమ్మవారికి మొక్కులు సమర్పించుకున్నారు. నగరం నలుమూలల నుంచి వచ్చిన భక్తులతో ఆలయం కిక్కిరిసిపోయింది.