అమ్మాయిలపై నోరు, చేయి జారితే తాటతీసే చట్టం తెస్తాం

PAWAN KALYAN
PAWAN KALYAN

అమ్మాయిలపై నోరు, చేయి జారితే తాటతీసే చట్టం తెస్తాం

పాలకుల నిర్లక్ష్యంపై దీక్ష చేస్తా
స్పెషల్‌ అగ్రికల్చర్‌ జోన్‌లపై యోచన
విద్యార్థులతో ముఖాముఖిలో పవన్‌

అనంతపురం: రాయలసీమ జ్ఞాన సీమ అని, పాలకుల నిర్లక్యాలను ఎంతో సహనంతో ఓర్చుకుం టున్న క్షమాభూమి అని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ కొని యాడారు. మంగళవారం సాయంత్రం నగరంలోని శ్రీసెవన్‌ కన్వెన్షన్‌ హాల్‌లో ఆయన విద్యార్థులతో ముఖాముఖి కార్యక్ర మాన్ని నిర్వహించారు. జనసేన రాష్ట్ర నాయకులు నాదెండ్ల మనోహర్‌, రావెల కిషోర్‌బాబులతో కలిసి నిర్వహించిన అనం తపురం విద్యార్థులతో భేటీ, నిరుద్యోగం, కరవు వలసలపై సమీక్షను నిర్వహించారు. ఈసందర్భంగా పరిమిత సంఖ్యలో విద్యార్థులను అనుమతించిన వందలాది విద్యార్థిని విద్యార్థులు ఈకార్యక్రమంలో పాల్గొన్నారు.