నిర్భయ దోషి క్షమాభిక్ష పిటిషన్ తిరస్కరణ

‘క్యురేటివ్’ తిరస్కరణ తర్వాత మెర్సీ పిటిషిన్ పెట్టుకున్న పవన్

president-ram-nath-kovind-nirbhaya-convict-pawan-gupta
president-ram-nath-kovind-nirbhaya-convict-pawan-gupta

న్యూఢిల్లీ: నిర్భయ దోషుల్లో ఒక్కడైనా దోషి పవన్ కుమార్ గుప్తా క్షమాభిక్ష కోరుతూ పెట్టుకున్న పిటిషన్ ను రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తిరస్కరించారు. పవన్ దాఖలు చేసిన క్యురేటివ్ పిటిషన్ ను సుప్రీంకోర్టు ఇటీవల తోసిపుచ్చింది. ఆ తర్వాత తనకు క్షమాభిక్ష పెట్టాలని కోరుతూ రాష్ట్రపతికి పవన్ పిటిషన్ పెట్టుకున్నాడు. ఇదిలా ఉండగా, నిర్భయ దోషులు నలుగురికి ఈ నెల 3న ఉరితీయాల్సి ఉన్నప్పటికి పవన్ పిటిషన్ మేరకు పాటియాలా హౌస్ కోర్టు స్టే విధించిన విషయం తెలిసిందే. తదుపరి ఆదేశాలు వచ్చే వరకూ ఈ ‘స్టే‘ కొనసాగనుంది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/