మా ఇళ్లను కూల్చారు..మీ ప్రభుత్వం కూలడం తథ్యం – పవన్

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పటం గ్రామంలో పర్యటిస్తున్నారు. గ్రామంలో నడుస్తూ కూల్చివేసిన ప్రతీ ఇంటిని పవన్ కళ్యాణ్ పర్యటిస్తున్నారు. ఆపై బాధిత గ్రామాస్తులతో మాట్లాడారు. పవన్ ముందు బాధితులు తమ గోడును వెళ్లబోసుకుంటున్నారు. ఈ సందర్బంగా వైస్సార్సీపీ ప్రభుత్వం ఫై ఆగ్రహం వ్యక్తం చేసారు. హుంతలు పూడ్చలేదు , రోడ్లు వేయలేని మీకు రోడ్ల విస్తరణ కావాలా అని ప్రశ్నించారు. వైస్సార్సీపీ ఇలానే చేస్తే ఇడుపులాపాయలో హైవే రోడ్డు వేస్తామన్నారు. మా ఇళ్లను కూల్చారు..మీ ప్రభుత్వం కూలడం తథ్యం అని హెచ్చరించారు. రోడ్డు వెడల్పు అంటూ మహాత్మా గాంధీ, అబ్దుల్ కలాం, నెహ్రూ గారి విగ్రహాలు, ఆఖరికి శివుడికి కాపలాగా ఉండే నంది విగ్రహాన్ని కూడా కూల్చేశారు, ఒక్క వైఎస్సార్ విగ్రహాన్ని కూల్చకుండా వదిలేశారు ఎందుకు అని ప్రశ్నించారు.

సజ్జల గారు.. ఏ ఒక్కరికీ ఏమి జరిగినా, ఎవరి ప్రాణాలు పోయినా, బాధ్యత మీరే తీసుకోవాలి .. మీరు ఎన్ని కోట్లు సుపారీలు ఇచ్చినా సరే మీరే బాధ్యత తీసుకోవాలి అని పవన్ అన్నారు. ఈ ఉదయం ఇప్పటం గ్రామానికి వెళ్లేందుకు పవన్ కళ్యాణ్ నిన్న రాత్రే మంగళగిరి చేరుకున్నారు. ఇవాళ ఉదయం ఇప్పటం బయలుదేరేందుకు ఆయన సిద్ధమయ్యారు. అయితే పోలీసులు మాత్రం ఆయన్ను మంగళగిరి జనసేన కార్యాలయం నుంచి బయటికి రాకుండా అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్దితులు తలెత్తాయి. విషయం తెలుసుకున్న జనసేన కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. వారిని నియంత్రించేందుకు పోలీసులు అపసోపాలు పడ్డారు. అనంతరం పవన్ కళ్యాణ్ వాహనాల్లో కాకుండా నేరుగా నడుచుకుంటూ మంగళగిరి నుంచి ఇప్పటం బయలుదేరారు.