పెళ్లి కార్డు ఫై పవన్ ఫోటో పెట్టుకొని తన అభిమానాన్ని చాటుకున్న వీరాభిమాని

పవన్ కళ్యాణ్ కు కోట్లకొద్దీ అభిమానులు ఉన్నారనే సంగతి తెలిసిందే. సినిమాల పరంగానే కాక వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ ను చాల మంది ఇష్టపడుతుంటారు. ఇందులో సినిమా స్టార్స్ కూడా ఉన్నారు. తాజాగా ఓ అభిమాని తన పెళ్లి కార్డు లో పవన్ ఫోటో పెట్టుకొని తన అభిమానాన్ని చాటుకొని వార్తల్లో నిలిచాడు.

శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండ‌లం కేశ‌వ‌రావు పేట గ్రామానికి చెందిన త‌మ్మినేని శ్రీనివాస్‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు వీరాభిమాని. ఈ డిసెంబ‌ర్ 18న ఆయ‌న పెళ్లి కుదిరింది. త‌న జీవితంలో జ‌ర‌గుతున్న శుభకార్యంలో ఈ అభిమాని ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఫొటోను ముద్రించుకున్నారు. సాధార‌ణంగా పెళ్లి కార్డుల‌పై దేవ‌తా మూర్తుల బొమ్మ‌ల‌ను ప్రింట్ చేసుకుంటారు క‌దా, మ‌రి మీరెందుకు ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఫొటోను ప్రింట్ చేయించుకున్నార‌ని ఎవ‌రైనా అడిగితే ప‌వ‌న్ క‌ళ్యాణ్ త‌న‌కు దేవుడితో స‌మానం అని, అందుకనే ఆయ‌న ఫొటోల‌ను ముద్రించుకున్నాన‌ని అంటున్నాడు. అంతే కాదు పెళ్లిలో భోజ‌నాల‌కు ఉపయోగించే గ్లాసులు, ప్లేట్లు తదితర వస్తులన్నింటిని పై కూడా పవన్ ఫొటోలు ఉండాలని భావిస్తున్నట్లు శ్రీనివాస్ చెప్ప‌డం విశేషం.