అలీ ఛాయిస్‌ ఎక్కడికైనా వెళ్లోచ్చు

Ali, pawan
Ali, pawan

అమరావతి: ప్రముఖ నటుడు అలీ వైఎస్‌ఆర్‌సిపిలో చేరిన విషయం తెలిసిందే. అయితే దీనిపై జనసేన అధినే పవన్‌ పవన్‌ కల్యాణ్‌ స్పందించారు. ఓ టివి ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పవన్‌ మాట్లాడుతు యాక్టర్లు, పాపులారిటీ రెండూ వేరు వేరు. పాపులారిటీని చూసి జనం చప్పట్లు కొడతారు. ఆ చప్పట్లను సీరియస్‌గా తీసుకోకూడదు. వాటిని నమ్మకూడదు. నాకు కూడా చాలా మంది చెబుతుంటారు. వాటిని నేను నమ్మను. ఇక అలీకి అవకాశం ఉంది. ఎక్కడికైనా వెళ్లొచ్చు. జగన్ మోహన్ రెడ్డికి బలం ఉందని నమ్మి వెళ్లాడు. చంద్రబాబుకు లేదని అక్కడికి వెళ్లకపోవచ్చు. అది ఆయన ఛాయిస్ అంటూ పవన్‌ తెలిపారు.


మరిన్ని తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/