జగన్ ఊపు కు పవన్ బ్రేక్

ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఊపుకు జనసేనాధినేత పవన్ కళ్యాణ్ నీళ్లు చల్లారు. గత కొద్దీ నెలలుగా జగన్ మీడియాకే పరిమితమయ్యారు. కరోనా నేపథ్యంలో జనాల మధ్యకు రాలేదు. ఈ క్రమంలో మళ్లీ జనాల్లోకి వెళ్లాలని అనుకున్నారు. బద్వేల్ ఉప ఎన్నికలను అస్త్రంగా చేసుకొని జనాల్లోకి వెళ్లాలని ప్లాన్ చేసారు. కానీ బద్వేల్ ఎన్నికల్లో పోటీ నుండి జనసేన , తెలుగుదేశం పార్టీ లు తప్పుకోవడం తో..ఇక బద్వేల్ స్థానం వైసీపీ కే అన్నట్లు అయ్యింది. ఈ తరుణంలో జనాల్లోకి వెళ్లడం ఎందుకని జగన్ ఆలోచిస్తున్నారట. పోయిపోయి పోటీలో లేని టీడీపీ, జనసేనను విమర్శించలేరు. అలాగని కాంగ్రెస్, బీజేపీ పేరు ప్రస్తావించినా అది అంతకంటే ఘోరంగా ఉంటుంది. అందుకే జగన్ బద్వేల్ ఉపపోరుని బాగా లైట్ తీసుకున్నారట జగన్.

అయితే ఈ ఎన్నికల విషయంలో పవన్ కళ్యాణ్ చాల తెలివిగా ప్రవర్తించారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. బద్వేల్ లో జనసేన అభ్యర్థి పోటీ చేసినా, బీజేపీ అభ్యర్థికి తాను ప్రచారం చేసినా ఏం జరుగుతుందో పవన్ కి బాగా తెలుసు. అందులోనూ రిపబ్లిక్ సినిమా ఫంక్షన్లో ఆయన ఆవేశంగా మాట్లాడి రోజులు కూడా గడవలేదు. ఈ దశలో బద్వేల్ లో బొక్కబోర్లా పడితే జనం నవ్వుతారు, అభిమానులు బాగా నిరాశ చెందుతారు. అందుకే పోటీ చేయకుండా సైలెంట్ గా ఉంటె మద్దతు ఇచ్చారనే సింపతీ అయినా వస్తుందని పవన్ ఆలోచించాడని అంత అంటున్నారు. ఏది ఏమైనా జగన్ ఊపుకు పవన్ బ్రేక్ వేసినట్లు అయ్యిందని చెప్పొచ్చు.