‘భవదీయుడు భగత్ సింగ్’ గా పవర్ స్టార్

పవన్ కళ్యాణ్ – హరీష్ శంకర్ కలయికలో తెరకెక్కబోయే చిత్రానికి ‘భవదీయుడు భగత్ సింగ్’ అనే టైటిల్ ఫిక్స్ చేసారు. దీనికి సంబదించిన ఫస్ట్ లుక్ గురువారం విడుదల చేసి అభిమానుల్లో ఉత్సాహం నింపారు. వకీల్ సాబ్ మూవీ తో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న పవన్..ప్రస్తుతం వరుస పెట్టి సినిమాలు చేస్తున్నాడు. ఓ మూవీ సెట్స్ ఫై ఉండగానే మరో మూవీ ని ప్రకటిస్తున్నాడు. ఇప్పటికే భీమ్లా నాయక్ , హరిహర వీరమల్లు చిత్రాలు సెట్స్ ఫై ఉండగానే..హరీష్ శంకర్ డైరెక్షన్లో ఓ మూవీ చేయబోతున్నాడు.

ప్రస్తుతం ప్రీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ మూవీ కి భవదీయుడు భగత్ సింగ్ అంటూ టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ విడుదల చేశారు చిత్ర యూనిట్ . ప్రస్తుతం ఈ పోస్టర్ నెట్టింట్లో వైరల్ అవుతోంది. భగత్ సింగ్ అంటే తనకు ఇష్టమని పవన్ కళ్యాణ్ ఇది వరకు ఎన్నో సార్లు చెప్పుకొచ్చారు. అలాంటిది ఏకంగా భవదీయుడు భగత్ సింగ్ అంటూ టైటిల్ పెట్టడం అభిమానుల్లో సంతోషం నింపుతుంది.

పవన్ కళ్యాణ్ – హరీష్ శంకర్ కలయికలో గబ్బర్ సింగ్ మూవీ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ మూవీ ఎంత పెద్ద హిట్ అయ్యిందో తెలియంది కాదు. అభిమానులు ఎలా అయితే పవన్ కళ్యాణ్ ను చూడాలనుకున్నారో ..ఆలా చూపించి హరీష్ అభిమానులను ఆకట్టుకున్నారు. ఇప్పుడు కూడా పవన్ ఇమేజ్ కు తగ్గట్లు సినిమా తెరకెక్కించాలని అభిమానులు కోరుకుంటున్నారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవి శ్రీ మ్యూజిక్ అందిస్తున్నారు.