ముందస్తు వల్లే తెలంగాణలో బరిలోకి దిగలేదు

PAWAN--
PAWAN

ముందస్తు వల్లే తెలంగాణలో బరిలోకి దిగలేదు

అనంతపురం : తెలంగాణలో ముందస్తు ఎన్నికలు రావడం వల్లనే అక్కడ జనసేన పోటీ చేయలేదని, 2019లో ఎన్నికలు వచ్చివుంటే అక్కడ కచ్చితంగా పోటీ చేసేవారిమని రాబోయే రోజుల్లో ఏపీలో మాదిరిగానే తెలంగాణలో కూడా బలమైన పాత్ర పోషిస్తామని జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ అభిప్రాయపడ్డారు. అనంతపురం జిల్లా పర్యటనలో భాగంగా రెండోరోజు అనంతపురం రూరల్‌ మండలం లోని ఎ.నారాయణపురంలో ధనుంజయ్య, సంజప్ప తదితర రైతుల పంట పొలాలను పవన్‌కళ్యాణ్‌ పర్యటించి రైతుల ఇబ్బందులను తెలుసుకున్నారు.