సైదాబాద్ : చిన్నారి కుటుంబాన్ని పరామర్శించిన పవన్..

సైదాబాద్ సింగరేణి కాలనీ లో ఆరేళ్ల చిన్నారి అత్యాచారానికి గురై హత్య కాబడిన సంగతి తెలిసిందే. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఇప్పటికే రాజకీయ నేతలు , సినీ ప్రముఖులు బాధిత కుటుంబాన్ని పరామర్శిస్తూ నిందితుడ్ని కఠినంగా శిక్షించాలని , ఇలాంటి ఘటనలు మరోసారి జరగకూడదని కోరుకుంటున్నారు. బుధువారం సినీ నటుడు , జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బాధిత కుటుంబాన్ని పరామర్శించారు.

బాలిక కుటుంబాన్ని పరామర్శించిన పవన్ కళ్యాణ్ .. చిన్నారి తల్లిదండ్రులను ఓదార్చారు. తానున్నానని ధైర్యం చెప్పారు. తల్లిదండ్రుల బాధను చూసి భావోద్వేగానికి లోనైన జనసేనాని.. నిందితునికి శిక్ష పడే వరకు పోరాడతానని భరోసా ఇచ్చారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలి. అమ్మాయి తల్లిదండ్రులకు ఈ సమయంలో ఓదార్పు అవసరం. దోషికి శిక్ష పడేవరకు జనసేన పోరాడుతుంది. బాలిక తల్లిదండ్రులు రాజుపై ముందే అనుమానం వ్యక్తం చేశారు. పోలీసులు సరిగా స్పందించలేదని బాలిక తల్లిదండ్రులు చెప్పినట్లు మీడియా కు తెలియజేసారు.

ఇక పవన్ రావడం తో ఆ ప్రాంతమంతా అభిమానులతో నిండిపోయింది. సింగరేణి కాలనీకి పవన్​ చేరుకోగానే.. ఆయన్ను చూసేందుకు అభిమానులు ఎగబడటంతో తోపులాట చోటుచేసుకుంది. అభిమానుల రద్దీ వల్ల కారు దిగలేక పవన్‌ ఇబ్బంది పడ్డారు. అభిమానుల తోపులాటలో ఓ స్థానికుడి కారు కూడా ధ్వంసమైంది. అభిమానుల తీరుతో పవన్​ ఒకింత అసహనానికి గురైనట్టు సమాచారం.