జైలు నుంచి టీడీపీ నేత పట్టాభి విడుదల

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్‌ మోహన్ రెడ్డి ఫై అనుచిత వ్యాఖ్యలు చేసి అరెస్ట్ అయిన టీడీపీ నేత కొమ్మారెడ్డి పట్టాభి రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యారు. పట్టాభికి హైకోర్టు బెయిల్‌ మంజూరు చేయడంతో ఆయన జైలు నుంచి విడుదలయ్యారు. రెచ్చ గొట్టే వ్యాఖ్యలు చేశారని పట్టాభిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. దీంతో బెయిల్ కోరుతూ పట్టాభి తరపు న్యాయవాది హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్‌ను స్వీకరించిన హైకోర్టు ధర్మాసనం పట్టాభి కి బెయిల్ మంజూరు చేసింది.

రాజమండ్రి కేంద్ర కారాగారం నుంచి విడుదలైన పట్టాభి విజయవాడకు బయలుదేరారు. మీడియాతో మాట్లాడేందుకు పట్టాభి నిరాకరించారు. గురువారం నాడు పట్టాభిని విజయవాడ పోలీసులు అరెస్ట్ చేశారు.
అనంతరం కోర్టు 14 రోజుల రిమాండ్ విధించడంతో తొలుత మచిలీపట్నం జైలుకు తరలించారు. ఇక అటునుంచి అతడిని రాజమండ్రి కేంద్ర కారాగారానికి తరలించారు అధికారులు. ఇక శనివారం పట్టాభికి హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీంతో ఆయన జైలు నుంచి విడుదలయ్యారు.