రామ మందిర నిర్మాణానికి భారీ విరాళం

రూ. 10 కోట్లు ప్రకటించిన మహావీర్‌ మందిర్‌ ట్రస్ట్‌

Ram mandir In Ayodhya
Ram mandir In Ayodhya

పాట్నా: అయోధ్యలో రామమందిర నిర్మాణానికి బీహార్ లోని మహావీర్ మందిర్ ట్రస్ట్ భారీ విరాళం ప్రకటించింది. ఈ మేరకు ట్రస్ట్ కార్యదర్శి కిశోర్ కునాల్ ఓ ప్రకటన చేశారు. రామమందిర నిర్మాణానికి రూ.10 కోట్లు విరాళాన్ని ప్రకటించారు. ముందుగా రూ.2 కోట్ల చెక్కును అందజేయనున్నట్టు తెలిపారు. మిగిలిన మొత్తాన్ని దశలవారీగా ట్రస్ట్ కు అందజేస్తామని వెల్లడించారు. రామమందిర నిర్మాణం నిమిత్తం విరాళాల కోసం తాము ఏర్పాటు చేసిన పెట్టెలో లభించిన ఈస్ట్ ఇండియా కంపెనీ 1818లో ముద్రించిన అణాపైస విలువ చేసే నాణేలను కూడా రామ మందిర ఆలయ ట్రస్ట్ కు అందజేస్తామని విర రించారు. ఆ నాణేలపై రాముడు, సీత, లక్ష్మణుడు, హనుమంతుడి రూపాలు ఉన్నట్టు చెప్పారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/