సబితా పార్టీ మార్పు ఫై ఆమె కుమారుడు కార్తీక్ క్లారిటీ

అసెంబ్లీ ఎన్నికల ముందు నుండి బిఆర్ఎస్ పార్టీ కి వరుసగా షాకులు ఇస్తున్న పార్టీ నేతలు. ఎన్నికల ముందు పెద్ద ఎత్తున పార్టీకి రాజీనామా చేసి బిజెపి , కాంగ్రెస్ లో చేరగా..ఎన్నికల ఫలితాల తర్వాత మరింత జోరు అందుకున్నాయి. ఓటమి చెందిన నేతలే కాదు గెలిచినా ఎమ్మెల్యేలు సైతం కాంగ్రెస్ లో చేరారు. ఈ క్రమంలో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సైతం పార్టీ మారబోతున్నారనే వార్తలు వైరల్ అవుతున్న నేపథ్యంలో ఆమె కుమారుడు కార్తీక్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు.

శుక్రవారం తెలంగాణ భవన్ లో మీడియా సమావేశంలో కార్తీక్ మాట్లాడుతూ..నాడు ప్రత్యేక పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ నుండి మారామని, కానీ రాజకీయ అవసరాల కోసం, పదవుల కోసం మారలేదని క్లారిటీ ఇచ్చారు. పార్టీలు మారే సంస్కృతి మాకు లేదని , తెలంగాణలో కక్షపూరిత రాజకీయాలు కొనసాగుతున్నాయని, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తల మీద కేసులు పెడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఫిరాయింపులకు పాల్పడుతున్నదని, ఇప్పటికే ఆరుగురు ఎమ్మెల్యేలు, ఆరుగురు ఎమ్మెల్సీలను కాంగ్రెస్‌లో చేర్చుకున్నారన్నారు. రాహుల్ గాంధీ పార్టీ ఫిరాయింపులు సరికాదు అని చెబుతుంటే రాష్ట్రంలో మాత్రం రేవంత్ రెడ్డి ఫిరాయింపులకు పాల్పడుతున్నారని, టీ పీసీసీ.. ఏఐసీసీలో భాగం కాదా..? అని ప్రశ్నించారు. బీజేపీతో కేసీఆర్ కుమ్మక్కు అయ్యాడని కాంగ్రెస్ పార్టీ నాయకులు వ్యాఖ్యానించడం సరికాదని, కాంప్రమైజ్ అయితే ఎమ్మెల్సీ కవిత ఎందుకు జైల్లో ఉంటది..? అని ప్రశ్నించారు. పనికట్టుకుని కేసీఆర్‌పై బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు అక్కసు వెళ్లగక్కుతున్నాయన్నారు.