సహనంతో స్నేహం కలకాలం

Friendship

నిజమైన స్నేహం క్షేమాన్నే కోరుతుంది. కీడు కోరుకోదు. చాలామంది ప్రత్యేకంగా యువకులు వారికి తాడుడు, సిగరెట్‌ తాగే అలవాటు ఉంటే, దాన్ని తోటిస్నేహితులకు కూడా అలవాటు చేస్తారు. ఆ అలవాటును నేర్పేందుకు బలవంతం చేస్తారు. అవి ఆరోగ్యానికి ఏమాత్రం మంచివి కావని తెలిసినా, తాను బలహీనమైనట్లే ఇతరులను బలహీనులను మార్చే ప్రయత్నం చేస్తారు. ఇది నిజమైన స్నేహమనిపించుకోదు. స్నేహం పేరుతో చేసే మోసం, వంచన కిందకే వస్తుంది. మీరు ఏ యువకులనైనా అడిగండి, ఈ అలవాటు ఎలా వచ్చింది అంటే స్నేహితులవలననే అని చెబుతారు. కొందరు కాదు చాలామంది మాత్రం బాగా చదువ్ఞకోమని, జీవితాన్ని ఆదర్శవంతంగా చేసుకోవాలని నూరిపోస్తారు. వీరు నిజమైన స్నేహితులు.

స్నేహం చేసుకునే వ్యక్తి, నిస్వార్థంగా ఇతరుల క్షేమం కోసం చూస్తాడు కాని తన స్వార్థానికి కాదు. మంచి స్నేహితుల్ని ఎంచుకోవడానికి ముందు మీతో మీరు మైత్రి కలిగి ఉండాలి. మీ స్వీయ సహచర్యానికి మీ సహనం ఉండాలి. స్నేహమేరా జీవితం స్నేహమేరా శాశ్వతంగా ఉండడానికి కొన్ని పద్ధతులు ఆచరించాలి.
్య మీ మిత్రులు ఎలా ఉన్నారో వారిని అలాగే స్వీకరించండి. మీ మిత్రులు ఇవ్వలేనిదాన్ని గురించి చికాకుపడి కోపం తెచ్చుకోకండి. ప్రతి ఒక్కరిలోని అసంపూర్ణతనూ, వారి వ్యక్తిత్వాన్నీ స్వీకరించాలి. సహాయం చేయడానికి సహాయాన్ని కోరడానికి ఆత్రుతా భావాన్ని కల్గి ఉండండి. అంతేకాని మితిమీరి అడగడానికి, మితిమీరిన విధంగా వాడుకోబడడానికీ అవకాశం ఇవ్వకండి.

అనుమానాలను సందేహాలను తీర్చడం వల్ల స్నేహం బలాన్ని పుంజుకుంటుంది. కాని ఏది చెప్పకుండా ఉండడం మంచిదో తెలుసుకుని ఉండండి.
్య మీ స్నేహితుని ప్రశంసించి ప్రోత్సహించండి. మీ స్నేహితుడిలో మీకు నచ్చిన విషయమేదో చెప్పండి. మీ స్నేహితుడి మీ జీవితంలో ప్రకాశించినందుకూ మీతో ఉంటున్నందుకూ కృతజ్ఞతలను తెలియ జేయండి. వారి గుణగణాలు మెచ్చుకోండి. వారిలోని మంచిని ప్రోత్సహించండి. వారి తెలివితేటలకు సంతోషించండి. వారి విజ యాలను ప్రశంసించండి. మీ వ్యక్తిగత భావాలకూ, ఆలోచనలకూ మనం అధికారాన్ని కలిగి ఉండండి. మీ అంతరంగపు మారు మూలాల్లో చొరపడేందుకు ప్రయత్నించే స్నేహితులనూ, స్నేహ సంబంధాలనూ పాడుచేసుకునే ప్రమాదం ఉంది. ఈ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి. మీ భావాలు అవి మంచివైనా సరే లేదా మంచివి కానివైనా సరే బయటపెట్టండి. మీలోని కోపాన్ని, ఆరాటాన్నీ దాచిపెట్టుకోవడం కంటే బయటపెట్టడమే మంచిది.

మీ స్నేహితులకు మీ సలహాలను నిర్మాణాత్మకంగా ఉండేలా చూసుకోండి. మీ స్నేహితుడికి మాట్లాడాలని ఉంటే అతడి మాటలను ఏమాత్రం అడ్డు తగలకుండా వినండి. సలహాలను కోరితే సక్రమమైన సలహాలను ప్రోత్సహించే సలహాను ఇవ్వండి.
్య మీ స్నేహితులతో నిజాయితీతో నమ్మకంగా ఉండాలి. నమ్మకమే నిజాయితీ ఈ మాటలకు అర్థం మీ స్నేహితుడితో అటు మంచిరోజులలోనూ, ఇటు గడ్డు రోజులలోనూ కలిసి ఉండడం అవ్ఞతుంది. స్నేహితుడు ఎదుట లేనప్పుడు అతడిని విమర్శించడం కానీ, లేదా ఇతరులకు విమర్శించే అవకాశాన్ని ఇవ్వకుండా ఉండడం అవ్ఞతుంది.

స్నేహితులను సరిసమానంగా చూడండి. స్నేహంలో తారతమ్యాలు, వైరుధ్యాలు, వైవిధ్యాలు లేకుండా అందరినీ సరిసమానంగా చూడాలి. స్నేహంలో ప్రథములు, ద్వితీయులు అన్న మాటకు చోటు ఉండకూడదు. అదేవిధంగా మీరు ఎంత బుద్ధిమంతులో ఎంతగా ఎదిగారో, మీ స్నేహితుడి కంటే మీరు గొప్ప లేదా అతడే మీ కంటే గొప్ప అన్న భావనను రానివ్వకండి. స్నేహితులను నమ్మండి. విశ్వసించండి. స్నేహితుల పట్ల పరిపూర్ణమైన అవగాహన కల్గి ఉండడం ముఖ్యమైనది. మీది ప్రవర్తన పట్ల మీకు మంచి అభిప్రాయం కల్గిందంటే మీ స్నేహితుల మంచితనంపై నమ్మకంను కలిగి ఉండండి.
్య ఇతరుల పట్ల ఆదరభావాన్ని కలిగి ఉండి మంచిగా మెలగడం చాలా ముఖ్యం. అభిరుచులను అభివృద్ధి చేసుకోండి.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/business/