రుచిసోయాకొనుగోలుకు పతంజలి భారీ ఆఫర్‌!

న్యూఢిల్లీ : బాబారామ్‌దేవ్‌పతంజలి ఆయుర్వేద్‌ ఎట్టకేలకు రుచిసోయా కొనుగోలుకు 4350 కోట్ల ఆఫర్‌ను ప్రకటించింది. రుచిసోయాకు రుణభారం పెరగడంతోఎన్‌సిఎల్‌టివరకూ వెళ్లినసంగతి తెలిసిందే. ప్రస్తుతం సంస్థను కొనుగోలుచేసేందుకు బ్యాంకులకు 4350 కోట్లు చెల్లిస్తామని, అంతేకాకుండా కంపెనీ ఆర్ధికపరిపుష్టిని పెంచేందుకు రూ.1700 కొత్తగా నిధులు వరకూ చేర్పించగలమని పతంజలి గ్రూప్‌ స్పష్టంచేసింది. బ్యాంకర్లు మొత్తం బకాయిల్లో సుమారు 60శాతం తగ్గించి 4300 కోట్లకు నిర్ణయించారు. ఆతర్వాత జనవరిలో ఉపసంహరించుకుంది. పరిష్కారం ప్రణాళికజాప్యం కావడంతో పతంజలి అంతకుముందు 4100 కోట్ల ఆఫర్‌ను పెంచాల్సి వచ్చింది ఆదాని విల్‌మార్‌కు పోటీగా పతంజలి అదనంగా 1700 కోట్లు పెట్టుబడులుపెడతామని ముందుకువచ్చింది. ఆదాని ఈ పోటీలో పతంజలి ఎక్కువ మొత్తంపెట్టింది. ఆదాని ఆఫర్‌ గతంలో బ్యాంకురుణాలు పరిష్కరించుకునేందుకు మాత్రమే ఉపకరిస్తుందని, కొత్త పెట్టుబడులకు అవకాశం లేదని భావించాయి. రుచిసోయా ఇండోర్‌ కేంద్రంగా పనిచేస్తోంది. వంటనూనెలశుద్ధి కంపెనీగా ఉన్న ఈ కంపెనీ గత 2017 డిసెంబరులోనే దివాలాకు వచ్చింది. రుణభారకం 12వేల కోట్లకుపెరిగింది. అమ్మకాలు 31,500 కోట్లనుంచి 12వేల కోట్లకు పడిపోయింది. బ్యాంకింగ్‌వర్గాలకథనం ప్రకారం కొత్త రివైజింగ్‌ అంశాలప్రకారంచూస్తే రుచిసోయాను కొనుగోలుచేసేంఉదకు ముందు 24 కంపెనీలవరకూ పోటీపడ్డాయి. ప్రైవేటు ఈక్విటీ మేజర్‌ కంపెనీలు కెకెఆర్‌, ఆయాన్‌ కేపిటల్‌ వినియోగరంగ ఉత్పత్తులకంపెనీలు ఐటిసి, గోద్రెజ్‌ ఆగ్రోవెట్‌, ఇమామి వంటివిఉన్నాయి. వీటితోపాటే పతలంజిలి, ఆదాని విల్‌మార్‌లు సైతం ఉనానయి. నిపుణుల అంచనాలప్రకారంచూస్తే కంపెనీకి ఐదు ఓడరేవుల ఆధారిత రిఫైనింగ్‌ ప్లాంట్లు ఉన్నాయి. అందువల్లనే బిడ్డర్లు పోటీపడుతున్నారు.


https://www.vaartha.com/news/business/  
మరిన్ని తాజా వార్తల కోసం బిజినెస్‌ క్లిక్‌ చేయండి :