శంషాబాద్ విమానాశ్రయంలో ప్రయాణీకుల సందడి

ఇతర రాష్ట్రాల నుంచి 1600 మంది రాక

Shamshabad Airport
Shamshabad Airport

Hyderabad: శంషాబాద్‌ విమానాశ్రయంలో  దేశీయ విమానాల రాక ప్రారంభమయ్యిందని తెలంగాణ సీఎస్‌ సోమేష్‌ కుమార్‌ తెలిపారు.

ప్రయాణికుల ఆరోగ్యంపై జాగ్రత్తలు తీసుకున్నామన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు ప్రకారం తాము అన్ని చర్యలు తీసుకున్నామని సీఎస్‌ వెల్లడించారు.

సెక్యూరిటీ పరంగా, ఆరోగ్య పరంగా ఎయిర్ పోర్ట్‌లో అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని చెప్పారు. ఆరోగ్య సేతు యాప్‌ ఉన్నవాళ్లనే అనుమతిస్తున్నామన్నారు.

ఇప్పుడు వచ్చే వారికి పరీక్షల అనంతరమే అనుమతిస్తున్నామని, ఎలాంటి కరోనా లక్షణాలు లేని వారికి 14 రోజుల క్వారన్‌ టైన్‌ లేదని తెలిపారు.

ప్రతి అంశంలో జాగ్రత్తలు తీసుకున్నామని, ప్యాసింజర్‌ని టచ్‌ చేయకుండా సెన్సార్‌లు ఏర్పాటు చేసామని చెప్పారు.  ఇప్పటి వరకు వచ్చిన ఎవరికీ కూడా కరోనా లక్షణాలు లేవని తెలిపారు.

సోమవారం 19 విమానాలు హైదరాబాద్‌కు రావడంతో పాటు మరో 19 విమానాలు హైదరాబాద్‌ నుండి ఇతర రాష్టాలకు వెళ్లాయని పేర్కొన్నారు.

1600 మంది ఇతర రాష్టాల నుండి నేడు హైదరాబాద్‌కి వచ్చినట్లు తెలిపారు. ప్యాసింజర్‌ లేకుంటే మాత్రమే ప్లయిట్స్‌ క్యాన్సల్‌ అవుతున్నాయని చెప్పారు.

రేపటి నుండి మరిన్ని విమాన సర్వీస్‌లు పెరిగే అవకాశం ఉందని, దాని దృష్టిలో పెట్టుకొని మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటామన్నారు.

తాజా ‘మొగ్గ’ (చిన్నారుల ప్రత్యేకం) కోసం : https://www.vaartha.com/specials/kids/