పార్టీ మేకప్‌

అందమే ఆనందం

Makeup tips
Makeup tips

ఫ్రెండ్స్‌తో కలిసి పార్టీలకు వెళ్లేటప్పుడు ఫ్యాషన్‌గా ఉండే డ్రెస్‌తో పాటు మేకప్‌ కూడా స్టయిల్‌గా ఉండేలా చూసుకోవాలి. బంగారు లేదా నీలిరంగులో కళ్లు. పెదవులను సింగారించుకుంటే ప్రత్యేకంగా కనిపిస్తారు. పార్టీలో మీరే సెంటర్‌ ఆఫ్‌ ఎట్రాక్షన్‌ అయ్యేందుకు ఏం చేయాలంటే..

బ్లూ మెటాలిక్‌ షేడ్‌ : ఈ మేకప్‌ కళ్లకు ప్రత్యేక ఆకర్షణ తెస్తుంది. దీనికి మ్యాచింగ్‌గా పెదవులకు గ్లానీ నూడ్‌ లిఫ్‌స్టిక్‌ వేసుకుంటే బోల్డ్‌గా కనిపిస్తారు. ఈ రెండటికి కొద్దిగా హైలైటర్‌ జోడిస్తే పార్టీ మేకప్‌ పర్‌ఫెక్ట్‌గా వస్తుంది.

స్మోకీ ఐస్‌ : పార్టీలో స్మోకీ ఐస్‌ మేకప్‌తో అందరి కళ్లు మీవైపు తిప్పుకోవచ్చు. ఈ మేకప్‌ ఏ సందర్భానికి అయినా చక్కగా సరిపోతుంది. కొద్దిగా లిఫ్‌స్టిక్‌ వేసుకుంటే చాలు.

చమ్మీ షేడ్స్‌ : ఇవి మీ లుక్‌ను కొత్తగా మార్చేస్తాయి. ఒకవేళ ఇవి మీకు సరిపడకుంటే
ఐ షాడోకు గ్లిట్టర్స్‌ అదుకోవాలి. బోల్డ్‌ లుక్‌ కోసం వింగ్‌ లైనర్‌తో అడ్జస్ట్‌ చేసుకోవాలి.

తాజా ఆధ్యాత్మికం వ్యాసాల కోసం : https://www.vaartha.com/specials/devotional/