పార్టీ అన్ని విధాలుగా రాకేశ్ కు అండగా ఉంటుంది

ఇటీవల చంద్రబాబు నివాసం వద్ద ఉద్రిక్తతలు..గాయపడిన డూండీ రాకేశ్

అమరావతి: వైస్సార్సీపీ కార్యకర్తలు ఇటీవల చంద్రబాబు నివాసం వద్ద ఆందోళనకు దిగగా, టీడీపీ శ్రేణులు వారిని నిలువరించే ప్రయత్నం చేశాయి. ఈ క్రమంలో టీడీపీ వాణిజ్య విభాగం కార్యదర్శి డూండీ రాకేశ్ గాయపడి, ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడు. రాకేశ్ ను నేడు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఫోన్ ద్వారా పరామర్శించారు.

రాకేశ్ కు అందిస్తున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని రాకేశ్ కు హామీ ఇచ్చారు. చంద్రబాబు నివాసం వద్ద జరిగిన రాళ్ల దాడిలో డూండీ రాకేశ్ కు కూడా బలమైన దెబ్బలు తగిలాయి. ఈ దాడిలో మంగళగిరి టీడీపీ నేత జంగాల సాంబశివరావు, ఓ టీవీ చానల్ కెమెరామన్ కూడా గాయపడ్డారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/international-news/