చంద్రన్న 4వ విడత పసుపు కుంకుమకు రూ. 1,721 కోట్లు

Partial suneeta
Partial suneeta

చంద్రన్న 4వ విడత పసుపు కుంకుమకు రూ. 1,721 కోట్లు

అనంతపురం: రాష్ట్రంలోని డ్వాక్రా సంఘాల మహిళలకు చంద్రన్న పసుపు కుంకుమ 4వ విడుత నిధులక్రింద రూ.1721 కోట్లను విడుదల చేస్తు నట్లు రాష్ట్ర మహిళా, శిశుసంక్షేమం, సెర్ఫ్‌ శాఖామా త్యులు పరిటాల సునీతమ్మ వెల్లడించారు. మంగళవారం అనంతపురంలోని డిఆర్‌డిఏ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో మంత్రి ఇందుకు సంబంధించిన వివరాలనువెల్లడించారు. డ్వాక్రా సంఘా లకు ఈమారు దసరాపండుగ కానుక క్రింద రాష్ట్ర ముఖ్య మంత్రి చంద్రబాబునాయుడు నిధులను మంజూరు చేశారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 86 లక్షల మంది సంఘ సభ్యులకు ఇప్పటిదాక 3 విడుతలుగా 8వేల రూపాయల చొప్పున రూ.6,883 కోట్లనుమంజూరు చేశామని వివరిం చారు.

4వ విడుత మొత్తంగా దసరా పండుగ సంద ర్భంగా ఒక్కొక్కరికి 2వేల రూపాయల ప్రకారం 1721 కోట్లను విడుదల చేస్తున్నామని, ఒక్కఅనంతపురం జిల్లాలోనే 5,38,223 మంది సభ్యులకు గాను ఇప్పటి దాక రూ.425 కోట్లను అందించినట్లు వెల్లడించారు. కాగా మహిళా సంఘాల సభ్యులకు ప్రతి ఒక్కరికి పసుపు కుంకుమ నిదులు జమ అవుతున్నాయా, లేదా అన్న విషయాలను తెలుసుకోవడానికి రాష్ట్రవ్యాప్తంగా సర్వే కూడా చేపట్టినట్లు వివరించారు. ఇందులో భాగంగా ఇప్పటిదాక 7,30,387 సంఘాలకు గాను 4,51,293 సంఘాల సమావేశాల ద్వారా వివరాలను సేకరించినట్లు తెలిపారు. అదేవిధంగా అర్హత వుండి పసుపు కుంకుమ నిధులు అందని సభ్యులు 39,216 మందిని గుర్తించా మని, ఇందులో భాగంగా జిల్లాలో కూడా అర్హత వుండి నిధులు అందని 5,449 మందికి పసుపు కుంకుమ నిధులు జమకాని విషయాన్నిగుర్తించామన్నారు.

ఇందుకు కారణాలను విశ్లేషించగా సంఘంసభ్యుల బ్యాంకుఖాతాలు ఈ కెవైసి కానందున నిధులు జమ కాలేదని స్పష్టమ య్యిందని, వారందరికి ఖాతాలను ఆధార్‌తో అనుసం ధానం చేయించామన్నారు. కొందరికి ఆన్‌లైన్‌లో లోపాల కారణంగా నిధులు జమ కాలేదని, వీటన్నింటిని సరిచేసి 10రోజుల్లోపు అందరి ఖాతాలకు నగదు జమ జరుగు తుందని మంత్రి స్పష్టం చేశారు. రాష్ట్రం లోటుబడ్జెట్‌లో వున్నప్పటికి ఆడపడుచులకు ఇచ్చిన హామీని ముఖ్య మంత్రి చంద్రబాబునాయుడు నిలుపుకుంటున్నారని, అందుకు ప్రతి మహిళ ఆయనకు కృతజ్ఞతలు తెలపాల న్నారు.

ఎన్నో సంక్షేమపథకాలను సిఎం చేపడ్తున్నా ఓర్వలేని కొందరు పదేపదే విమర్శిస్తున్నార న్నారు. అదేవిధంగా పంచాయితీరాజ్‌ను తీర్చిదిద్దుతున్న మంత్రి లోకేష్‌ను కూడా ఆడిపోసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రపంచాయితీరాజ్‌ మంత్రిగాలోకేష్‌ బాధ్యతలు చేపట్టిన నాటినుండి రాష్ట్రవ్యాప్తంగాసిసిరోడ్లు నిర్మించా మని, ఎల్‌ఈడి బల్పులుఏర్పాటు, త్రాగు నీటి సమస్యలు లేకుండాచేస్తూ పంచాయితీరాజ్‌, ఐటి శాఖ లను ఎంతో సమర్థవంతంగా నిర్వహిస్తున్న ఆయనను విమ ర్శించడం ఎందుకని ప్రశ్నించారు. భూములువున్నా తెల్లరేషన్‌ కార్డువున్న నిరుద్యోగులకుకూడా నిరుద్యోగభృతి అంది స్తున్నామని, చంద్రన్న బీమా,10రకాల పెన్షన్లు, డప్పు కళాకారులకుసైతం పింఛన్లు, కిడ్నీవ్యాధిగ్రస్థుల్లో డయాల సిస్‌ చేయించుకుంటున్న వారికి 2500 రూపా యల చొప్పున పింఛన్‌అందిస్తున్న విషయాలను వెల్లడించారు.