నేడు పార్లమెంట్ ఉభయసభలు నిరవధిక వాయిదా

న్యూఢిల్లీ : పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు షెడ్యూల్‌ కంటే ముందే నేడు వాయిదా పడే అవకాశం ఉన్నది. ఈ సారి బడ్జెట్‌ సమావేశాలు రెండు విడుతలుగా నిర్వహించిన విషయం తెలిసిందే. సమావేశాలు జనవరి 31న ప్రారంభం కాగా.. షెడ్యూల్‌ ప్రకారం ఈ నెల 8న ముగియాల్సి ఉన్నది. ఈ ప్రతిపాదనపై ప్రభుత్వం, ప్రిసైడింగ్‌ అధికారులు వివిధ పార్టీలకు చెందిన ఫ్లోర్‌ లీడర్లను సంప్రదించినట్లుగా సమాచారం.

అయితే, గురువారం లంచ్‌ అవర్‌కి ముందే సమావేశాలు వాయిదా పడే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇంతకు ముందు సైతం పార్లమెంట్‌ సమావేశాలు షెడ్యూల్‌ కంటే ఐదు రోజుల ముందుగానే వాయిదా పడిన విషయం విధితమే. సెషన్‌ సమయంలో ప్రభుత్వం ముందు సభలో ఎలాంటి ఏజెండా పెండింగ్‌లో లేదని ఓ సీనియర్‌ పార్లమెంటేరియన్‌ పేర్కొన్నారు. అయితే, సమావేశాలు త్వరగా ముగించడం ద్వారా ఇంధన ధరల పెంపుపై చర్చించేందుకు ప్రతిపక్షాలకు అవకాశం లభించకపోవచ్చని ప్రతిపక్ష నేత ఒకరు తెలిపారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/