రెండు పార్లమెంటరీ ప్యానెల్స్‌కు ఛైర్మన్లుగా బిజెపి ఎంపిలు

Parliament
Parliament

New Delhi: పార్లమెంట్‌లోని రెండు ప్రధానమైన కమిటీలకు ఛైర్మన్లుగా బిజెపి ఎంపిలు ఎన్నికయ్యారు. ఆర్థిక, విదేశీ వ్యవహారాల స్థాయీ సంఘాల ఛైర్మన్లుగా బిజెపి ఎంపిలు ఎన్నికయ్యారు. గతంలో ఈ రెండింటికీ ఛైర్మన్లుగా కాంగ్రెస్‌ ఎంపిలు ఉండేవారు. 17వ లోక్‌సభలో స్టాండింగ్‌ కమిటీల వివరాలను లోక్‌సభ సచివాలయం అప్‌డేట్‌ చేసింది. దీని ప్రకారం ఆర్థిక, విదేశీ వ్యవహారల స్టాండింగ్‌ కమిటీలకు బిజెపి ఎంపిలు జయంత్‌ సిన్హా, పిపి చౌధురి నేతృత్వం వహిస్తారు. గతంలో ఈ రెండింటికి కాంగ్రెస్‌ నేతలు వీరప్ప మొయిలీ, శశిథరూర్‌ ఛైర్మన్లుగా వ్యవహరించారు. గత లోక్‌సభ ఎన్నికల్లో వీరప్ప మొయిలీ ఓడిపోయారు. శశిథరూర్‌ను ఇన్‌ఫర్మేషన్‌ టెక్నాలజీ స్టాండింగ్‌ కమిటీ ఛైర్మన్‌గా నియమించారు.