అవిశ్వాసంపై శుక్రవారం చర్చ

అవిశ్వాసంపై శుక్రవారం చర్చ
న్యూఢిల్లీ: ఎన్‌డిఎ ప్రభుత్వంపై ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానానికి లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ ఆమోదం తెలి పారు. టిడిపి ఎంపి కేశినేని శ్రీనివాస్ ప్రతిపాదించిన ఈ తీర్మా నంపై శుక్రవారం చర్చకు వస్తుందని స్పీకర్ వెల్లడించారు. అన్ని ప్రతిపక్ష పార్టీలసభ్యులు మొత్తంగా అవిశ్వాస తీర్మానం ప్రతిపా దనలను అందచేసారని, టిడిపి ఎంపి కేశినేని శ్రీనివాస్ పేరు లాటరీలో రావడంతో ఆయన సొంతంగా తన తీర్మానాన్ని ప్రతిపా దించారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోని ఎన్‌డిఎ కూటమి నుంచి వైదొలగిన సంగతి తెలిసిందే.
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వకుండా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాని విస్మరించడంపై టిడిపి ధ్వజ మెత్తిన సంగతి తెలిసిందే. జీరో అవర్‌లో ప్రతిపాదించిన ఈ తీర్మానాన్ని స్పీకర్ సుమిత్రా మహాజన్ ఆమోదించారు. పార్లమెం టరీ వ్యవహారాల మంత్రి అనంత్‌కుమార్ మాట్లాడుతూ ప్రభత్వుం అవిశ్వాసాన్ని ఎదుర్కొనకేందుకు సిద్ధంగా ఉందని, సభలో మూ డింట రెండొంతుల సభలో మెజార్టీ తమదేనని అన్నారు. తెలుగు దేశం పార్టీ సభ్యులుకూడా ప్రత్యేకించి బడ్జెట్ సమావేశాల్లో ఒక పర్యాయం అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదించారు. అయితే స్పీకర్ ఆ తీర్మానాన్నితిరస్కరించారు. సభ సజావుగా లేనందున ఈ తీర్మా నాన్ని వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు.
దీనితో మొత్తం ప్రతిపక్షపార్టీల్లో అత్యధిక పార్టీలు నిరసన వ్యక్తంచేస్తూ నిరంతరం సభలో అంత రాయం కలిగించాయి. లోక్‌సభలో మొత్తం 545 స్థానాలుండగా మెజార్టీ 272 స్థానాలకు ఉంది. బిజెపికి 272స్థానాలున్నాయి. మిత్రపక్షాలు 39 స్థానాలు, కాంగ్రెస్ పార్టీ 48 స్థానాలు, ఎఐ ఎడిఎంకె 37 స్థానాలతోను, ఎఐటిసి 34స్థానాలు, బిజెడి 20 స్థానాలు, ఇతరులు 89 స్థానాల్లో ప్రాతినిధ్యం వహిస్తుండగా నామినేటెడ్ ఇద్దరుసైతం ఉన్నారు. ఖాళీగా నాలుగు స్థానాలు న్నాయి. బుధవారం ప్రారంభమైన లోక్‌సభ సమావేశాల్లో పెద్దఎత్తున దుమారంతోనే ప్రారంభం అయ్యాయి. తెలుగుదేశం పార్టీ, సమాజ్ వాదీ పార్టీ సభ్యులు వెల్లోనికి దూసుకువచ్చిన వివిధ సమస్యలు ప్రస్తావించారు. స్పీకర్ సుమిత్రా మహాజన్ ప్రశ్నోత్తరాల సమయం ప్రారంభించగానే ప్రతిపక్ష పార్టీలసభ్యులు కాంగ్రెస్ పార్టీతో సహా దేశంలోని వివిధ అంశాలపై చర్చించాలని పట్టుబట్టారు. ప్రశ్నోత్తరాల తర్వాత చర్చించవచ్చని ఇపుడు అను మతించబోమని స్పీకర్స్పష్టంచేసినా అనేకమంది సభ్యులు నినాదాలుచేస్తూ నిరసన వ్యక్తంచేస్తూనే ఉన్నారు.
టిడిపినుంచి సభ్యులు వెల్లోనికి దూసుకువచ్చి ప్లకార్డులు చేతబట్టి నినాదాలు చేసారు. మాకు న్యాయం కావాలి అంటూ సభ్యులు పెద్దపెట్టున నినాదాలుచేస్తూ ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పించాలని డిమాండ్చేసారు. సమాజ్‌వాదీ పార్టీనుంచిసైతం సభ్యులు వెల్‌లోకి దూసుకువచ్చి తాము ప్రస్తావించిన సమస్యలపై చర్చించాలని నినా దాలు చేసారు. అనేక మంది కాంగ్రెస్ సభ్యులుసైతం తమ తమ స్థానాల్లో నిలుచుని నిరన వ్యక్తంచేసారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ జోక్యం చేసుకుని ఎలాంటి అంశంపైనైనా తాము చర్చిం చేందుకు సిద్ధమేనని స్పష్టం చేసారు. తెల్లటి కుర్తా పైజామాలో వచ్చిన మోడీ అధికార, ప్రతిపక్ష బెంచ్‌ల ముందుకు ముకుళిత హస్తాలతో వచ్చి సభ్యులందరినీ పలకరించారు.
సమాజ్‌వాది పార్టీ అగ్రజులు ములాయం సింగ్ యాదవ్‌తో కొద్దిసేపు చర్చించారు. సభ్యులు ప్రధాని మోడీ సభలోకి రావడంతోనే చప్పట్లతో స్వాగతం పలికారు. ప్రధాన మంత్రి మోడీ మాట్లాడుతూ తన ప్రభుత్వం ఎలాంటి చర్చకు అయినా సిద్ధమేనని సభలో కీలక అంశాలపై అన్నింటిపైనా చర్చిస్తామని వెల్లడించారు. అన్ని పార్టీలు లేవనెత్తిన అంశాలపై చర్చకు తాము సిద్ధమేనని స్పష్టంచేసారు. యుపిఎ ఛైర్పర్సన్ సోనియాగాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఇతరులు లోక్‌సభకు హాజరయ్యారు. ప్రశ్నోత్తరాల సమయం ముందు నలుగురు కొత్త సభ్యులచేత స్పీకర్ మహాజన్ ప్రమాణ స్వీకారం చేయించారు.
అమరావతిµ: ఎపికి ప్రత్యేకహోదా, విభజన చట్టం హామీల అమలుపై టిడిపి అధి ష్టానం ఐదు నెలలుగా అవిరామంగా శక్తికిమించి కేంద్రంపై పోరా టం కొనసాగిస్తూ బుధవారం నుంచి ప్రారంభమైన పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో టిడిపి ఎంపీలు తొలిరోజే కేంద్రంపై అవి శ్వాస నోటీసును స్వీకర్ సుమిత్రా మహాజన్‌కు ఇచ్చి ఉభయ సభ ల్లో ఆందోళనలు ఉధృతం చేయడంతో ఎంపి కేశినేని నాని ఇచ్చిన నోటీసును స్పీకర్ చర్చకు ఆమోదం ప్రకటించారు. ఉభయ సభలు ప్రారంభంలోనే రాజ్యసభ, లోక్‌సభలో టిడిపి ఎంపీలు మూకు మ్మడిగా ప్లకార్లుతో ఆందోళనకు దిగారు.
ప్రశ్నోత్తరాల సమయంలో పలువురు ఇతర రాష్ట్రాల ఎంపీలు ప్రశ్నలు వేయడం, సంబంధిత మంత్రుల సమాధానాలు కొనసాగిస్తుండగా టిడిపి ఎంపీలు పెద్ద ఎత్తున కేంద్రంపై నిరసనలతో నినాదాలను హోరెత్తించారు. దీంతో స్పీకర్ ఒక మెట్టు దిగి ప్రశ్నోత్తరాల సమయంలో ఆందోళన చేయరాదని, బిఎసి సమావేశం నిర్వహిస్తామని ఆందోళనను విర మించాలని సూచించారు.