జూలై 18 నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు

Parliament
Parliament

జూలై 18 నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు

న్యూఢిల్లీ,: పార్లమెంటు వర్షాకాల సమావేశాలు వచ్చే నెల 18వ తేదీనుంచి ప్రారంభం అవు తున్నాయి. పార్లమెంటరీ వ్యవహారాల కేబినెట్‌ కమిటీచేసిన సిఫారసులమేరకు ఆగస్టు 10వ తేదీవరకూ వర్షాకాలసమావేశాలు జరుగుతాయి. హోంమంత్రి రాజ్‌నాధ్‌సింగ్‌ అధ్యక్షతన జరిగిన పార్లమెంటరీ వ్యవ హారాల కేబినెట్‌కమిటీ సోమవారం ఢిల్లీలోసమావేశమై తేదీలను సిఫారసుచేసింది. రాష్ట్రపతి లాంఛన ప్రాయంగా ముందు సమావేశాలను ప్రారంభిస్తారు

. ఈ సమావేశాలు మొత్తం 18సార్లు ఉంటాయని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి అనంత్‌కుమార్‌ వెల్లడించారు. మొత్తం ఆరు ఆర్డినెన్స్‌లను ఆమోదిం చాల్సి ఉంటుంది. కేంద్రమంత్రి మాట్లాడుతూ రాజ్యాంగానికి 123వ సవరణ బిల్లు 2017,ముస్లిం మహిళలు వివాహం, హక్కులపరిరక్షణ బిల్లు 2017, హిజ్రా హక్కులపరిరక్షణ బిల్లు 2016, జాతీయ వైద్య కమిషన్‌ బిల్లు 2017, బాలలవిద్యా, నిర్బంధ విద్య రెండోసవరణ 2017 బిల్లులను పార్లమెంటు ఉభయసభలు ఆమోదించాల్సి ఉంది. అలాగే పార్లమెంటులో ఎగువసభగా భావించే రాజ్యసభకు డి ప్యూటి ఛైర్మన్‌ పదవికి ఎన్నికసైతం జరగాల్సి ఉంది. ఇప్పటివరకూ పనిచేసిన కురియన్‌ పదవీకాలం ముగియడంతో వెంటనే డిప్యూటిఛైర్మన్‌ పదవికి ఎన్నిక నిర్వహించాల్సి ఉంది, ఈసమావేశాల్లోనే పాలకపార్టీ అత్యంత కీలకమైన బిల్లులను ఆమోదింపచేసుకోవాలనిప్రయత్నిస్తోంది. వీటివల్ల సామాజి కంగాకూడా కొంతప్రభావం ఉంటుందని అంచనా.

ఉభయసభలను పూర్తికాలంపాటు పనిచేసేందుకు వీలుగా నడిపించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని వారికిష్టంవచ్చినట్లుగా వ్యవహరించడం, లేనిపక్షంలో వదిలివేయడం అన్న నిర్లక్ష్యధోరణి ఇకపై పనికిరాదని కేంద్ర మాజీ మంత్రి జైరామ్‌రమేష్‌ వెల్లడించారు. గత సమావేశాల్లో అవిశ్వాసం తీర్మానప్రతిపాదనలు కొంత సభాకార్యకలాపాలకు అంతరాయం కలిగిం చాయి. వాటిని అనుమతించకపోతే అదేరోజు వాయిదాపడుతూ వచ్చాయి.