పార్లమెంట్‌ సమావేశాలు పొడిగింపు

parliament
Parliament

న్యూఢిల్లీ : ఆగస్టు 7 వరకు పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు పొడిగించడానికి ప్రభుత్వం నిర్ణయించినట్టు అధికార వర్గాలు గురువారం వెల్లడించాయి. పార్లమెంటరీ వ్యవహారాల క్యాబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పాయి. సమావేశాలు పొడిగింప బడవచ్చని బుధవారం ప్రభుత్వం సూచించింది. సమాచార మంత్రి ప్రకాష్ జావదేకర్ ఈ సందర్భంగా విపక్షాలు ఎప్పుడూ పార్లమెంటు సమావేశాలను ఎక్కువ రోజులు సాగించాలని డిమాండ్ చేస్తుంటాయని, ఇప్పుడు తాము అదే చేస్తున్నామని ఆయన వ్యాఖ్యానించారు. జూన్ 17న ప్రారంభమైన సమావేశాలు జులై 26 నాటికి పూర్తి కావలసి ఉంది.


తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/