మార్షల్‌ డ్రెస్‌ కోడ్‌ పై వివరణ ఇచ్చిన వెంకయ్యనాయుడు

Venkaiah Naidu
Venkaiah Naidu

ఢిల్లీ: రాజ్యసభ అధికారులకు డ్రెస్‌ కోడ్‌లో మార్పులు చేసిన విషయం తెలిసిందే. కాగా దీనిపై పలువురు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. మిలిటరీ యూనిఫాంను వాళ్లు మాత్రమే ధరించాలని, ఇతర వ్యక్తులు దానిని ధరించటం చట్టవిరుద్ధమని, భద్రతా రీత్యా ప్రమాదకరం కూడా అని మాజీ సైన్యాధిపతి విపి మాలిక్‌ అన్నారు. దీనిపై రాజ్యసభ ఆలోచించి, తగిన చర్యలు తీసుకోవాలని ఆశిస్తున్నట్లు ఆయన తెలిపారు. అంతేకాకుండా రాజ్యసభలోనూ ఈ డ్రెస్‌కోడ్‌ విషయంపై విపక్ష సభ్యులు ఆందోళన చేశారు. కాగా దీనిపై స్పందించిన రాజ్యసభ ఛైర్మన్‌ వెంకయ్యనాయుడు.. డ్రెస్‌ కోడ్‌పై వస్తున్న అభ్యంతరాల దృష్ట్యా మార్పు నిర్ణయాన్ని పునఃసమీక్షిస్తామన్నారు. సెక్రటేరియట్‌ అన్ని విధాలా సలహాలు, సూచనలు తీసుకున్న తరువాతే ఈ కొత్త డ్రెస్‌ కోడ్‌ తీసుకువచ్చిందని ఆయన చెప్పారు. అయినప్పటికీ మరోసారి దీనిపై సంప్రదింపులు జరిపి సరైన ఆలోచన చేస్తామని వెంకయ్యనాయుడు తెలిపారు.
తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news