‘దిశ’ హత్యాచార ఘటనపై రాజ్యసభలో చర్చ

తమ అభిప్రాయాలను తెలిపిన ఎంపీలు

Ghulam Nabi Azad
Ghulam Nabi Azad

న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైన ‘దిశ’ హత్యాచార ఘటనలో రాజ్యసభలో చర్చ కొనసాగుతోంది. ఈ సందర్భంగా కాంగ్రెస్ నేత గులాం నబీ ఆజాద్ మాట్లాడుతూ..దిశ హత్య దేశం మొత్తాన్ని కలచివేసిందని ఆజాద్ అన్నారు. కేవలం చట్టాలు చేయడం ద్వారా సమస్య పరిష్కారం కాదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆడపిల్లలపై దాడుల వంటి సమస్యలను మూలాల నుంచి తొలగించడాని సమాజం నిలబడాలని వ్యాఖ్యానించారు. ఎలాంటి పక్షపాతం లేకుండా నిందితులను కఠినంగా శిక్షించాలని ఆయన అన్నారు. దిశ హత్య నిందితులను కఠినంగా శిక్షించాలని ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ కోరారు. ఇటువంటి ఘటనలు మరోసారి పునరావృతం కాకుండా చూడాలని డిమాండ్ చేశారు. ఇటువంటి ఘటనలు జరగకుండా సామాజిక సంస్కరణ జరగాలని దేశంలోని న్యాయ వ్యవస్థతో పాటు అన్ని వ్యవస్థలను తాను కోరుతున్నట్లు కాంగ్రెస్ ఎంపీ అమీ యజ్ఞిక్ అన్నారు.
తాజా వీడియోస్‌ కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/videos/