పార్లేలో భారీ సంఖ్యలో కార్మికుల తొలగింపు!

Parle G
Parle G

బెంగళూరు: పార్లే కంపెనీ మొనాకో, పార్లేజీ, మేరీ బ్రాండ్ల పేరిట బిస్కెట్లను ఉత్పత్తి చేస్తున్న విషయం తెలిసిందే. దేశీయంగా ఇది అతిపెద్ద బిస్కెట్ల తయారీ కంపెనీ భారీ సంఖ్యలో కార్మికులను తొలగించే అవకాశం ఉన్నట్లు సమాచారం. విక్రయాలు భారీగా పడిపోవడమే అందుకు కారణంగా తెలుస్తోంది. దేశీయంగా ఆటోమొబైల్‌, రిటైల్‌తో పాటు దాదాపు అన్ని రంగాలు నేల చూపులు చూస్తున్న వేళ దిద్దుబాటు చర్యల్లో భాగంగా కంపెనీలు ఉత్పత్తి, ఉద్యోగుల నియామకాలను తగ్గింపు దిశగా చర్యలు తీసుకుంటున్నాయి. ఈ క్రమంలో పార్లే సైతం అదే బాటలో పయనిస్తున్నట్లు కనిపిస్తోంది. కాగా ప్రస్తుతం సంస్థలో దాదాపు లక్ష మంది కార్మికులు పనిచేస్తున్నారు. దేశవ్యాప్తంగా 10 సొంత ఉత్పత్తి కేంద్రాలతో పాటు, 125 థర్డ్‌ పార్టీ బిస్కెట్ ఉత్పత్తి కేంద్రాలు ఉన్నాయి. దీనిపై సంస్థ ప్రతినిధి మయాంక్‌ షా మాట్లాడుతూ..ఖఖవిక్రయాల్లో తగ్గుదల నమోదవుతున్న క్రమంలో జీఎస్టీపై కొన్ని వెసులుబాట్లు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరాం. ఒకవేళ ప్రభుత్వం దీనిపై స్పందించకపోతే దాదాపు 8 వేల నుంచి 10 వేల మంది కార్మికుల్ని తొలగించడం తప్ప ఇంకో ప్రత్యామ్నాయం లేదుగగ అని ప్రస్తుత పరిస్థితుల్ని వివరించారు.


తాజా ఎడిటోరియల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/editorial/