సినీ లవర్స్ కు షాక్ ఇచ్చిన తెలంగాణ సర్కార్

సినీ లవర్స్ కు తెలంగాణ సర్కార్ పిడుగులాంటి ప్రకటన తెలిపింది. గతంలో సినిమా థియేటర్స్ లలో పార్కింగ్ ఫీజు వసూళ్లు చేసేవారు. ఆ తర్వాత తెలంగాణ సర్కార్ ఫీజు వసూళ్లు ఎత్తేసారు. దీంతో సినీ ప్రేమికులంతా సంబరాలు చేసుకున్నారు. కానీ ఇప్పుడు మళ్లీ ఫీజు వసూళ్లు చేయాలనీ నిర్ణయం తీసుకుంది. సినిమా చూసేందుకు వచ్చే వాళ్లే కాకుండా బయటివాళ్లు కూడా వచ్చి పార్కింగ్ చేస్తున్నారని థియేటర్ యాజాన్యాలు ప్రభుత్వానికి తెలుపడం.. అంతే కాకుండా ఆ వాహనాల భద్రత తమకు సవాల్ గా మారింది అని యాజమాన్యాలు ఆవేదన వ్యక్తం చేయడం తో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

ఇక ఈ నిర్ణయం తో సినిమా లవర్స్ కు ప్రభుత్వం షాక్ ఇచ్చినట్లు అయ్యింది. ఇప్పటి నుండి మళ్లీ సినిమా టికెట్ తో పాటు పార్కింగ్ ఫీజు కింద బైకు కు 20 పెద్ద వాహనాలకు అంతకంటే ఎక్కువే చెల్లించాల్సి ఉంటుంది. రేపటి నుండి అన్ని థియేటర్స్ లలో పార్కింగ్ ఫీజులు వసూళ్లు చేయనున్నారు.