59 పార్కులను సిద్ధం చేయాలి

Park
Park

59 పార్కులను సిద్ధం చేయాలి

అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి

హైదరాబాద్‌: హైదరాబాద్‌ చుట్టూ అర్బన్‌ ఫారెస్టు పార్కులను నిర్ణీత కాల వ్యవధిలో అభివృద్ధి చేయాలని అటవీశాఖ ప్రత్యేక ప్రధాన కార్య దర్శి అజ§్‌ుమిశ్ర అధికారులను ఆదేశించారు. హైదరాబాద్‌ చుట్టూ ఏడు జిల్లాల్లో విస్తరిం చిన అటవీ పార్కులను ప్రజలకు అందుబా టులోకి తేవాలని ముఖ్యమంత్రి ఆదేశించార న్నారు. అర్బన్‌ ఫారెస్టు పార్కులను అభివృద్ధి చేస్తున్న వివిధ శాఖలకు చెందిన అధికారు లతో ఆయన అరణ్యభవన్‌లో సమావేశం నిర్వహించారు. శాఖల వారీగా జరిగిన అటవీ బ్లాక్‌ల కేటాయింపు, అభివృద్ధి పనులు పురో గతిని విడివిడిగా సమీక్షించారు. ఎట్టిపరిస్థి తుల్లోనూ పార్కుల అభివృద్ధి ప్రజలకు అందుబాటులోకి తేవడం ఆలస్యం జరగడా నికి వీలు లేదన్నారు. తెలంగాణాకు హరితహా రంలో భాగంగా పట్టణ ప్రాంతాలకు సమీ పంలో ఉన్న అటవీ ప్రాంతాల్లో పార్కుల అభివృద్ధి జరుగుతుందన్నారు.