ఎంపీ మాధవ్‌పై ఘాటు వ్యాఖ్యలు

ఇంకోసారి రవి గురించి మాట్లాడితే ఊరుకోబోమన్న సునీత

P. Sunitha

అమరావతి: దివంగత పరిటాల రవి ఫ్యాక్షనిజం, నక్సలిజం పేరుతో ఎంతోమంది తలలను నరికారంటూ వైఎస్‌ఆర్‌సిపి హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ చేసిన వ్యాఖ్యలు అనంతపురం జిల్లాల్లో రాజకీయ దుమారాన్ని రేపాయి. చంద్రబాబు అండతో రవి దుర్మార్గాలు చేశారని ఆయన అన్నారు. రాప్తాడు ప్రాంతంలోని పొలాలు నీళ్లు లేక ఎండిపోతుంటే… రవి ఆ పొలాలను రక్తంతో తడిపారని అన్నారు.

ఈ వ్యాఖ్యలపై మాజీ మంత్రి, పరిటాల రవి భార్య పరిటాల సునీత మండిపడ్డారు. నీ చరిత్ర ఏమిటో మాకు తెలుసని ఘాటు వ్యాఖ్యలు చేశారు. నీ మాదిరి రోడ్డెక్కి మాట్లాడి, విలువను తగ్గించుకోలేమని అన్నారు. ఇంకోసారి రవి గురించి మాట్లాడితే ఊరుకునే ప్రసక్తే లేదని వార్నింగ్ ఇచ్చారు. రవి గురించి నీకు ఏం తెలుసని మాట్లాడుతున్నావని మండిపడ్డారు. రవి రాజకీయాల్లోకి వచ్చిన తర్వాతే ఎస్సీలు, ఎస్టీలు సంతోషంగా ఉన్నారని అన్నారు. గోరంట్ల మాధవ్ వ్యాఖ్యలపై టీడీపీ శ్రేణులు కూడా మండిపడుతున్నాయి.


తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/