రైల్వేలో పారామెడికల్‌ పోస్టులు

students
students


భారతీయ రైల్వే దేశవ్యాప్తంగా ఉన్న వివిధ రైల్వే బోర్డుల్లో , ప్రొడక్షన్‌ యూనిట్లలో ఖాళీగా ఉన్న పారామెడికల్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలైంది. ఖాళీలసంఖ్య: 1937, ఇందులో జనరల్‌-936, ఇడబ్ల్యూస్‌-158, ఒబిసి-419, ఎస్సి-272, ఎస్టి-151 విభాగాల వారీగా ఖాళీలు: స్టాఫ్‌నర్స్‌-1109, డైటీషియన్‌-4, డెంటల్‌హైజనిస్ట్‌-5, డయాలసిస్‌ టెక్నీషియన్‌-20, ఎక్స్‌టెన్షన్‌ ఎడ్యుకేటర్‌-11,గ్రేడ్‌2 హెల్త్‌ అండ్‌ మలేరియా ఇన్‌స్పెక్టర్‌-289, గ్రేడ్‌3 ల్యాబ్‌ సూపరింటెండెంట్‌-25, ఆప్టోమెట్రిస్ట్‌-6, పర్‌ఫ్యూజనిస్ట్‌-1, ఫిజియోథెరపిస్ట్‌-21,గ్రేడ్‌3 ఫార్మసిస్ట్‌-277, రేడియోగ్రాఫర్‌ -61, స్పీచ్‌ థెరపిస్ట్‌-1, ఇసిజి టెక్నీషియన్‌-23, లేడీ హెల్త్‌ విజిటర్‌ -2,గ్రేడ్‌2 ల్యాబ్‌ అసిస్టెంట్‌ -82, కోల్‌కతా -236, ముంబై- 232, చండీగఢ్‌-197, అలహాబాద్‌-176, చెన్నై-173.సికింద్రాబాద్‌-112, తదితరబోర్డుల్లో ఖాలీలున్నాయి.
అర్హత: స్టాఫ్‌ నర్స్‌కు జనరల్‌ నర్సింగ్‌ అండ్‌ మిడ్‌వైఫరీలో సర్టిఫికెట్‌ లేదా బిఎస్సి నర్సింగ్‌ ఉత్తీర్ణులై ఉండాలి. హెల్త్‌ అండ్‌మలేరియా ఇన్‌స్పెక్టర్‌కు కెమిస్ట్రీప్రధాన సబ్జెక్టుతో బిఎస్సితో పాటు హెల్త్‌, శానిటరీ ఇన్‌స్పెక్టర్‌లో ఏడాది డిప్లొమా ట్రేడ్‌ సర్టిఫికెట్‌ ఉండాలి. ఫార్మసిస్ట్‌లకు సైన్స్‌లో ఇంటర్‌తోపాటు ఫార్మసిలో డిప్లొమా లేదా బిఫార్మసి ఉత్తీర్ణులై ఉండాలి. రేడియోగ్రాఫర్లకు ఫిజిక్స్‌, కెమిస్ట్రీలతో ఇంటర్‌తోపాటు రేడియోగ్రఫీ, ఎక్స్‌రే టెక్నీషియన్‌ లేదా రేడియోడయాగ్నసిస్‌ టెక్నాలజీలో డిప్లొమా, ల్యాబ్‌ అసిస్టెంట్లకు సైన్స్‌లో ఇంటర్‌ తోపాటు డిఎంఎల్‌టి లేదా ఎంఎల్‌టిలో సర్టిఫికెట్‌ ఉండాలి. వేర్వేరు పోస్టులకు వేర్వేరుగా ఉన్నాయి.
వయోపరిమితి: గరిష్టంగా 33 ఏండ్లకు మించరాదు. పోస్టులను బట్టివేరువేరుగా ఉన్నాయి.
ఫీజువివరాలు: జనరల్‌,ఒబిసిలకు రూ. 50)/- ఎస్సి, ఎస్టి, పిహెచ్‌సి, ఎక్స్‌సర్వీస్‌మెన్‌, మహిళ, ట్రాన్స్‌జెండర్‌,మైనారిటీస్‌, ఆర్థికంగా వెనుకబడిన తరగతులు రూ. 250/-
ఎంపికవిధానం: కంప్యూటర్‌ బేస్డ్‌టెస్ట్‌ద్వారా, ఆబ్జెక్టివ్‌ విధానంలో మొత్తం 100మార్కులకు ఉంటుంది. దీనికిగాను గంటన్నరను కేటాయిస్తారు. దీనిలో సంబంధిత సబ్జెక్టు-70, జనరల్‌ అవేర్‌నెస్‌-10, జనరల్‌ అర్థమెటిక్‌, జనరల్‌ ఇంటెలిజెన్స్‌ అండ్‌ రీజనింగ్‌-10, జనరల్‌ సైన్స్‌-10, మార్కులుంటాయి. ఇంటర్వ్యూలేదు. పరీక్షలో నెగిటివ్‌ మార్కులు ఉంటాయి. ప్రతీతప్పు సమాధానానికి 1/3మార్కులను తగ్గిస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా,
గమనిక: అర్హత కలిగిన అభ్యర్థులు ఏదైనా ఒక ఆర్‌ఆర్‌బిలో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తుఆఖరుతేదీ: ఏప్రిల్‌ 2.