ఎదురుకాల్పులో ఇద్దరు ఉగ్రవాదులు హతం

terrorists
terrorists

జమ్ముకశ్మీర్‌: పుల్వామా జిల్లా అవంతిపోరాలో ఎదురుకాల్పులు జరుగుతున్నాయి. ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారంతో ఓ ఇంటిని భద్రతా దళాలు చుట్టుముట్టాయి. ఉగ్రవాదులు కాల్పులు ప్రారంభించడంతో భద్రతా దళాలు జరిపిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. మరో నలుగు ఉగ్రవాదులు ఇంటిలో ఉన్నట్లు అనుమానిస్తున్నారు. భద్రతా దళాలకు ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి.


మరిన్ని వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/