విజయమ్మ, షర్మిల ప్రచారానికి ఎందుకొచ్చారు?

Panchumarthi Anuradha
Panchumarthi Anuradha

అమరావతి: టిడిపి అధికార ప్రతినిధి పంచుమర్తి అనురాధ గురువారం మీడియాతో మాట్లాడారు.. వైఎస్‌ఆర్‌సిపి అధ్యక్షుడు జగన్‌ సోదరి షర్మిల ఆ పార్టీ తరఫున పోటీకి పనికిరారా?.. ప్రచారానికే పనికొస్తారా? అంటు ఆమె ప్రశ్నించారు. 2014 ఎన్నికల తరహాలోనే వైఎస్‌ఆర్‌సిపి మళ్లీ అదే నాటకానికి తెరతీసిందని విమర్శించారు. ఐదేళ్ల తర్వాత విజయమ్మ, షర్మిల ప్రచారానికి ఎందుకొచ్చారని నిలదీశారు. వాళ్లు పోటీకి పనికిరారు గానీ సానుభూతి ప్రచారానికి కావాలా? అని వ్యాఖ్యానించారు. రాష్ట్రానికి అన్యాయం చేసిన మోదీ, కేసీఆర్‌పై వైకాపా నేతలు ఒక్క మాటా మాట్లాడరని మండిపడ్డారు. ముసుగు తొలగించి నిజాలు మాట్లాడాలని డిమాండ్ చేశారు. కేటీఆర్‌ వద్ద ఎన్ని కోట్ల రూపాయలు తీసుకున్నారో చెప్పాలన్నారు. మంగళగిరి, గన్నవరం, విశాఖ, చిత్తూరులో చూస్తే ఐటీ కంపెనీలు ఎన్ని వచ్చాయో తెలుస్తాయన్నారు.


మరిన్ని తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/