పంచాయతీరాజ్ ఎఇ ఆత్మహత్య

suicide
suicide

జగిత్యాల: మేడిపల్లి మండలం వెంకట్రావుపేటలో ఈరోజు విషాదం చోటు చేసుకుంది. జగిత్యాల పంచాయతీరాజ్ ఇఇ కార్యాలయంలో ఎఇగా పని చేస్తున్న సంధ్య అనే యువతి ఆత్మహత్య చేసుకుంది. ఆమె ఆత్మహత్యకు దారి తీసిన కారణాలు తెలియరాలేదని పోలీసులు తెలిపారు. సంధ్య ఆత్మహత్యతో ఆమె కుటుంబంలో విషాదం నెలకొంది. పోస్టుమార్టం కోసం సంధ్య మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో విచారణ చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు.


తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/